అనుష్క అందంపై కన్నేసాడు, బ్రదర్ అంటూ షాకిచ్చింది!
హైదరాబాద్: హీరోయిన్ అనుష్క అందం గురించి ఇపుడు ప్రత్యేకించి కొత్తగా పొగడాల్సిన పని లేదు. హాట్ అండ్ సెక్సీ బ్యూటీ ఇమేజ్ ఉన్న అనుష్కకు ఎంతటిమగాడైనా పడి పోవాల్సిందే. ఇలానే అనుష్క అందానికి ఇటీవల ఓ టాలీవుడ్ యంగ్ హీరో బోల్డ్ అయ్యాడట. అనుష్కను లైన్లోకి లాగి ఎఫైర్ ప్రారంభించడానికి ట్రై చేసాడట. అయితే అందరి ముందు అతన్ని అన్నయ్యా అని పిలిచి ఆదిలోనే అతని ప్రయత్నానికి అడ్డుకట్ట వేసిందట అనుష్క.

ఈ విషయం ఇపుడు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. అయితే ఆ యంగ్ హీరో ఎవరు? అనేది చర్చనీయాంశం అయింది. అనుష్క పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుండి ఆమెకు ఇలాంటి చాలానే ఎదురయ్యాయని, అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఈ స్థాయికి ఎదిగిందని అంటున్నారు.
అనుష్క సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం ఆమె చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో ‘రుద్రమదేవి' చిత్రం చేస్తోంది. మరో వైపు అనుష్క నటించిన ‘లింగా' చిత్రం డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. రజనీకాంత్ హీరోగా చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications










