»   » 'బాహుబలి' దేవసేన పుట్టిన రోజు(ఫోటో ఫీచర్)

'బాహుబలి' దేవసేన పుట్టిన రోజు(ఫోటో ఫీచర్)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ఓ హీరోయిన్ గా ఇంత భారీగా ఈ మద్య కాలంలో ఎవరూ పుట్టిన రోజు జరపలేదేమో అనేంతలా అనుష్క పుట్టిన రోజు జరుగుతోంది. ఆమె పుట్టిన రోజుని పరుస్కరించుకుని ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న రుద్రమదేవి చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేస్తే...మరో ప్రక్క ఆమె కీలకపాత్రలో చేస్తున్న బాహుబలి చిత్రం మేకింగ్ వీడియోని విడుదల చేసారు. బాహుబలి చిత్రంలో ఆమె దేవసేన పాత్రను పోషిస్తోంది.


  హీరోయిన్ అంటే పాటలూ, నృత్యాలకే పరిమితం కాదు, అప్పుడప్పుడూ సాహసోపేతమైన పాత్రలు చేయాలి. అప్పుడే గుర్తింపు. అసుష్క ఇప్పుడు రూ.50 కోట్ల కథానాయికగా పేరు తెచ్చుకొందంటే కారణం.. అదే. అనుష్క కెరీర్‌ని 'అరుంధతి'కి ముందూ, ఆ తరవాత అని విభజించి చూసుకోవచ్చేమో..? సూపర్‌, విక్రమార్కుడు, మహానందిలాంటి సినిమాల్లో అందాల పాత్రలకే పరిమితమైన అనుష్క... 'అరుంధతి'తో తనలోని మరోకోణాన్ని బయటపెట్టింది. జేజమ్మగా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు 'రుద్రమ దేవి'గా మరోసారి కత్తితిప్పనుంది. గురువారం అనుష్క జన్మదినం. ఈ సందర్భంగా 'రుద్రమ దేవి' తొలి చిత్రాన్ని విడుదల చేశారు.

  మొదట్లో అనూష్క అందాల ప్రదర్శనికే ప్రయారిటీ ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుతంగా నటించిందంటూ మీడియా ప్రశంసించింది. అంతేగాదు అనుష్క సైతం తాను కేవలం అరుంధతి చిత్రంతోనే నటనకు అలవాటు పడ్డాను అంటుంది. ప్రస్తుతం మాత్రం ఆమె సినిమాల్లో ఎక్కువ భాగం ఆమె నటనకోసం తీసుకున్నవే.

  1981, నవంబర్‌ 7 జన్మించిన అనుష్క నేడు బర్త్‌డే జరుపుకుంటోంది. కెరీర్ సినిమాల గురించి... స్లైడ్ షో లో...

  స్వీటీ...

  స్వీటీ...

  మంగుళూర్‌లో పుట్టిన అనుష్క పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగుళూర్‌లోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్‌ కార్మెల్‌ కళాశాల నుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్‌ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్‌ రంగంలో పనిచేయాలని ఈమె అభిలాష. సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.

  ప్రొఫైల్‌

  ప్రొఫైల్‌

  అసలుపేరు : స్వీటీ శెట్టి
  పుట్టినరోజు : 7 నవంబర్‌ 1981
  ప్రాంతం : మంగళూరు, కర్నాటక
  నటన : వృత్తి
  ప్రారంభం : 2005....
  అవార్డు : కలైమామణి

  తల్లి,తండ్రులు...

  తల్లి,తండ్రులు...

  స్వీటీ శెట్టి అనే అసలు పేరు గల అనుష్క మంగుళూర్‌లో నవంబర్‌ 7, 1981న జన్మించింది. ఈమె తల్లిదండ్రులు ఎ.ఎన్‌.విఠల్‌ శెట్టి, ప్రఫుల్లా. ముగ్గురు సంతానంలో ఈమె అమ్మాయి ఒక్కతే. కంప్యూటర్స్‌ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసింది. భూమిక భర్త భరత్‌ ఠాగూర్‌ వద్ద ఈమె కొంతకాలం యోగా పాఠాలు నేర్చుకుంది. తరువాత ఈమె కూడా కొంత కాలం యోగా పాఠాలు చెప్పింది.

  తొలిచిత్రం

  తొలిచిత్రం

  2005లో పూరి జగన్నాథ్‌ సూపర్‌ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు అనుష్క. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకుంది. తమిళంలో మాధవన్‌ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్‌ గర్ల్‌గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి అనుష్క ఫెవికాల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకుందట.

  అరుంధతి...

  అరుంధతి...

  కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్‌. శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాల్లో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి, జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు.

  విక్రమార్కుడు

  విక్రమార్కుడు


  సూపర్ తర్వాత అస్త్రం, చింతకాయల రవి, స్వాగతం,ఒక్క మగాడు వంటి చిత్రాలు చేసినా రాని బ్రేక్ రాజమౌళి విక్రమార్కుడుతో వచ్చింది. అందులో క్లైమాక్స్ లో జింతాత అంటూ ఆమె చేసే అభినయానికి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

  తొలి చిత్రం సూపర్‌ చిత్రం ప్లాప్ అయినా స్టార్‌ డమ్‌ తీసుకొచ్చింది మాత్రం విక్రమార్కుడు అని చెప్పాలి. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన నటి పాత్రల్లో అద్భుతంగా నటించింది. ఈ సినిమాతో అనుష్క వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అఫర్లు విపరీతంగా వచ్చి పడ్డాయి. అన్ని చిత్రాలను ఒప్పుకోకుండా థా ప్రాముఖ్యం, అందులో తన పాత్రకు ఉన్న విలువ ఆధారంగా పాత్రలు ఎంపిక చేసుకునేది.

  బాలీవుడ్ కు సైతం...

  బాలీవుడ్ కు సైతం...

  సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనుష్క మొదటి సినిమాతోనే తనలోని నటిని ఆవిష్కరించింది.దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనుష్క బాలీవుడ్‌లోకి ఎంటరవ్వడానికి రెడీ అవుతోంది. ఇంత వరకూ హిందీ సినిమాలపై అంత మోజు కనబరచని అనుష్కకు బాలీవుడ్‌పై ఆసక్తి కలుగుతోందట. ఈ మేరకు ఆమె హిందీ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే రీమేక్‌ సినిమాలతో బాలీవుడ్‌లో సెటిలయిన ప్రభుదేవా అనుష్కను బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది.

  యోగ శిక్షణ...

  యోగ శిక్షణ...


  కన్నడ భామ అనుష్క శెట్టి తెలుగు,తమిళ సినీ ప్రేమికుల కలల దేవత. బెంగుళూరు నగరానికి చెందిన అనూష్క యోగా శిక్షకురాలుగా కెరీర్ ప్రారంభించి,నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. గోపీచంద్ తో చేసిన లక్ష్యం చిత్రం ఆమెకు మరోసారి లైఫ్ ఇచ్చింది. తర్వాత చేసిన డాన్,మహానంది చిత్రాలు నిరసపరిచినా ఆమె అవకాశాలపై వాటి ప్రభావం పడలేదు.

  ఐటం సాంగ్ సైతం...

  ఐటం సాంగ్ సైతం...


  చిరంజీవి స్టాలిన్ లో ఐటం సాంగ్ (ప్రత్యేక నృత్యం)చేసినా ఆ తర్వాత వాటికి దూరంగా ఉండిపోయింది. తన పాత్ర నచ్చి సినిమాలు చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటూ వస్తోంది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైన ఆమె సూర్యతో చేసిన యముడు(సింగం)తో అక్కడివారికి ఆరాధ్య దేవతగా మారింది.

  కాకతీయ వైభవం:

  కాకతీయ వైభవం:

  గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమ దేవి'. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతీయ తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్‌ త్రీడీ చిత్రమిది. రానా, నిత్యమీనన్‌, కేథరిన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 50 శాతం సినిమా పూర్తయింది. ఈ నెల 16 నుంచి మరో దఫా చిత్రీకరణ మొదలవుతుంది.

  దర్శకుడు మాట్లాడుతూ ''కాకతీయుల వైభవానికి ప్రతీక ఈ చిత్రం. గతేడాది సరిగ్గా ఇదే రోజు సినిమా ప్రారంభించాం. ఈ సినిమా కోసం అనుష్క అందిస్తున్న సహకారం మర్చిపోలేనిది. తన పాత్ర సహజంగా రావాలనే కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది. మొత్తం ఆరుపాటలుంటే వాటిలో ఐదింటిని తెరకెక్కించాం. మార్చి నెలాఖరులోగా సినిమా పూర్తవుతుంది''అన్నారు. కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్‌, సుమన్‌, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్‌, అజయ్‌ తదితరులు నటిస్తున్నారు. కళ: తోట తరణి, కెమెరా: అజయ్‌ విన్సెంట్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, సంగీతం: ఇళయరాజా.

  బాహుబలి

  బాహుబలి

  ప్రభాస్, అనుష్క జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ రాజమౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'బాహుబలి' చిత్రం షెడ్యూల్ పూర్తయింది. భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రాల జాబితాలో చేరబోతున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఐదు భారీ సెట్స్‌లో ఇప్పటివరకూ షూటింగ్ జరిగింది. గురువారం అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన 'బిహైండ్ ద సీన్స్' వీడియోను విడుదల చేసారు.

  శుభాకాంక్షలు...

  శుభాకాంక్షలు...

  స్వీటీ అనే ముద్దుపేరున్న అనూష్క తన అందాల ప్రదర్శనతో కుర్రకారులో మధురభావనలు రేపుతోంది. సరోజగా కవ్వించినా,భిళ్లాలో బికినీతో కనిపించినా,విక్రమార్కుడుతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా ఆమెకే ఆమే పోటీ..సాటి అన్నట్లుగా తెరను వేడిక్కిస్తోంది. త్వరలో ఢమురకం మ్రోగించటానికి రెడీ అవుతున్న ఆమె తెలుగు,తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆమెకు ధట్స్ తెలుగు శుభాకాంక్షలు...తెలియచేస్తోంది.

  English summary
  Anushka Shetty was born in a Bunt family of Bellipady in Mangalore. She did her schooling and college in Bangalore. She was also a Yoga Instructor and has trained under yoga guru Bharat Thakur. Today Anushka celebrating her birthday.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more