»   » పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమంటూ... అనుష్క ప్రకటన

పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమంటూ... అనుష్క ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లి విషయంలో నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 34. వీలైనంత త్వరంగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలవ్వాలనే ఆలోచనలో ఉంది. ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈ అందాల ముద్దు గుమ్మ.

‘నేను ఎక్కడి వెళ్లినా అంతా నా పెళ్లి గురించే అడుగుతున్నారు. ఈ విషయమై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని నాకూ ఉంది. కానీ ఇప్పటి వరకు నాకు తగిన వాడు దొరకలేదు. నాకు తగిన వాడు, నన్ను ఇంప్రెస్ చేసే వాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను' అని అనుష్క ప్రకటించింది.

Anushka clarification about marriage

ప్రస్తుతం అనుష్క తన సినిమా షూటింగుల్లో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన భారీ చిత్రం బాహుబలి గతేడాది విడుదలై ఆల్ టైం సెన్సేషన్ హిట్ గా నిలిచింది. సైజ్ జీరో చిత్రం యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం అనుష్క బాహుబలి పార్ట్ 2 షూటింగులో బిజీ బిజీగా గడుపుతోంది.

బాహుబలి తొలి భాగంలో అనుష్క పాత్ర పరిమితంగానే ఉంది. కానీ బాహుబలి పార్ట్ 2లో అనుష్క పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుందని, క్వీన్ దేవసేన పాత్రలో ఆమె ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించబోతోంది. బాహుబలి పార్ట్ 2 తర్వాత అనుష్క పెళ్లి పీటలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
'People have been asking me a lot of questions about my marriage. I would like to clarify all of them that I am yet to find a suitable match and if I come across anyone who impresses me, I will get married immediately,' the Anushka said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu