చివరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించుకున్నా: అనుష్క
'వేదం' సినిమాలో డబ్బింగ్ చెబుదామనుకొన్నా. అయితే సరోజ పాత్రలో గంభీరం, చిలిపిదనం, భయం, అమాయకత్వం ఇవన్నీ పలికించాల్సి వచ్చింది. పైగా అమలాపురం యాసలో మాట్లాడాలి.. ఇవన్నీ కష్టంగా అనిపించాయి. అందుకే చివరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించా అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. ఆమెను మీరు సీనియర్ నటి కదా మీ డబ్బింగ్ మీరే చెప్పుకోవచ్చు కదా అంటే ఇలా స్పందించింది.అలాగే..నాకూ నా గొంతుతో డబ్బింగ్ చెప్పాలనే ఉంది. అయితే భాష వచ్చేస్తే సరిపోదు. యాస తెలిసుండాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా మాట్లాడతారు. వాటి మీద కూడా అవగాహన ఉండాలి అంటూ వివరణ ఇచ్చింది.అలాగే ఇటీవల నాగార్జునతో నటిస్తున్న 'డమరుకం" చిత్రం షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్ళి సక్సెస్‌ఫుల్‌గా షెడ్యూల్‌ను పూర్తిచేసుకొని వచ్చామని కూడా అనుష్క అంటోంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తన పాత్ర అందరికి ఆశ్చర్యానికి గురిచేసే విధంగా వుంటుందని ఎంతో హుషారుగా చెప్పారు అనుష్క.


Click it and Unblock the Notifications











