హీరోలపై చురకలేసిన అనూష్క
నలుగురిని వెంటబెట్టుకొని ఎదురుపడిన వాళ్లందరినీ తోసేస్తూ హడావుడి చెయ్యటమంటే నాకు అస్సలు నచ్చదని అని అనూష్క చెప్తోంది.ఆమెను మీరు పబ్లిక్ లోకి వళ్ళినప్పుడు అభిమానుల నుంచి ఇబ్బంది ఎదురవ్వదా అని అడిగితే ఇలా స్పందించింది.చాలా మంది హీరోలు,స్టార్ హీరోయిన్స్ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు తమ సెక్యూరిటీగా తమ సొంత స్టాఫ్ ని తెచ్చుకుంటారు.వాళ్ళు జనాల్ని తోసేస్తూ హంగామా క్రియేట్ చేస్తూంటారు.ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఆమె ఇలా చురక అంటించింది.
అలాగే నాకు ఎప్పుడూ చేదు అనుభవాలు ఎప్పుడూ ఎదురవ్వలేదు.పైగా అభిమానుల స్పందన చూశాక మనమే ఏదేదో వూహించుకొని హడావుడి చేస్తున్నామని అనిపిస్తుంటుంది. నన్ను గుర్తుపట్టినప్పుడు నాళ్ళు దగ్గరికొచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతారు. తీరిక ఉంటే ఇస్తాను. లేదంటే ఇప్పుడు కుదరదని చెబుతాను. వాళ్లు అర్థం చేసుకొంటారు అంది. ఇక తెరపై పాత్రకు సరిపడేలా నటించాలి. బయట మాత్రం నేను నాలాగే ఉంటాను.ప్రస్తుతం ఆమె నాగార్జున సరసన ఢమురకం చిత్రం చేస్తోంది.ప్రభాస్ సరసన చేస్తున్న రెబెల్ నుంచి బయిటకు వచ్చింది.తాజాగా సెల్వ రాఘవన్ చిత్రం కమిటైంది.ఇటీవల ఆమె విక్రమ్ సరసన చేసిన నాన్న చిత్రం అందరి ప్రశంసలూ అందుకుంది.


Click it and Unblock the Notifications











