నాకో ప్రియుడున్నాడు: నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్‌ను ఖండించిన అనుష్క
నాగార్జున తనయుడు, ప్రముఖ హీరో నాగ చైతన్యతో రహస్యంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న వార్తలను కథానాయిక అనుష్క ఖండించింది. తనకు నాగచైతన్యతో రహస్య ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న వార్తలు వస్తున్నాయని అందులో ఎలాంటి నిజం లేదని చెప్పింది. నాగచైతన్య తన కంటె చిన్న వాడని అతడిని ఎలా చేసుకుంటానని చెప్పింది. తమ మధ్య ప్రేమ లేదు, పెళ్లి లేదన్నది. అయితే తనకు ఓ ప్రియుడు ఉన్నాడని స్పష్టం చేసింది. పెళ్లి మాత్రం ఇప్పుడు చేసుకోనని మరో రెండేళ్ల తర్వాత తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
కాగా ఇటీవల హీరోయిన్ అనుష్క, నాగచైతన్యకు రహస్యంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ వెబ్ సైట్లలో ఈ వార్తలు గుప్పుమన్నాయి. కోలీవుడ్ వెబ్ సైట్స్ అయిన దినకరన్, దినమలర్, విడుపు తదితర వెబ్ సైట్లలో ఈ వార్తలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











