మహేష్ కి అనూష్కను..

By Staff

Anushka
మొత్తానికి మహేష్ కి అనూష్కను కన్ఫర్మ్ చేసారు. అరుంధతితో పెద్ద హిట్ కొట్టడం ఆమెకు బాగా కలసివచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో శింగనమల రమేష్ నిర్మించనున్న చిత్రంలో ఆమె నటించటానికి సైన్ చేయటం ఓ ఘనతగా ఆమె భావిస్తోంది. ఇక మణిశర్మ సంగీతం అందించే ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. ఫైట్ మాస్టర్ విజయన్ ఈ చిత్రానికి ప్రత్యేకమైన పోరాట సన్నివేశాలు సమకూర్చటానికి సన్నధ్ధులు అయ్యారు. వాటితోనే షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.

ఇక మొదటి ఈ చిత్రంలో పార్వతీ మిల్టన్ ని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే మహేషే పట్టుబట్టి ఆమెను తొలిగించాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెపుతున్నారు. రాజస్ధాన్, సౌత్ ఆప్రికా, హైదరాబాద్ లలో ఈ చిత్రం కంటిన్యూగా షూటింగ్ జరుపుకోనుంది. ఎన్నోసార్లు ఈ చిత్రం ప్రారంభం వాయిదా పడటంతో అభిమానులు నిరాశపడటం,కొందరు మహేష్ ని సైతం సంప్రదించారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎడ్వెంచర్ గా రూపొందనుందని చెప్తున్నారు. ప్రస్తునానికి ఈ చిత్రానికి వరుడు అనే టైటిల్ ని వర్కింగ్ టైటిల్ గా నిర్ణయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X