కాజల్ కి చురక అంటించిన అనూష్క
కాజల్ ఆ మధ్యన తమిళంలో అనూష్క చేసిన సింగం సినిమాను హిందీలో చేస్తూ సౌత్ సినిమాను చిన్నతనం చేసి మాట్లాడి విమర్శలు పాలైంది.నిజానికి మొదట ఆ ఆఫర్ అనూష్కనే వరించింది.అయితే అనూష్క డేట్స్ లేకపోవటం వల్లే కాజల్ కి దొరికింది.అయితే ఆ సినిమా అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు.అందులోనూ కాజల్ సీన్స్ చాలా ఎడిట్ చేసేసారు.అయితే ఆ సినిమాని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ లో బిజీ అయిపోవచ్చునని ఆమె భావించి కొన్నాళ్ళు కాస్త బెట్టుగా బిహేవ్ చేసింది.ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఎంట్రీ గురించి అనూష్క అన్న మాటలు కాజల్ కి కౌంటర్ లాగ ఉన్నాయి.
అనూష్క మాటల్లోనే... బాలీవుడ్‌లో నటించాలని అందరికీ ఉన్నట్టే నాకూ ఉంది. అందుకని అవకాశాల కోసం వెంపర్లాడటం నాకు చేతకాదు.ఇప్పటికే నాకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. ఇక్కడ బిజీగా ఉండటం వల్ల వాటిని చేయలేకపోయాను. ఇప్పటికీ నేను చెప్పేదొక్కటే... ఇక్కడ ఖాళీ దొరికితేనే అక్కడ చేస్తాను.అంతేకానీ... అక్కడి అవకాశాల కోసం ఇక్కడి సినిమాలను వదులుకోలేను అంది.అలాగే ఒక నటిగా అరుంధతి, వేదం, దైవ తిరుమగళ్ చిత్రాలు నా జీవితంలో ప్రత్యేకమైనవి. నేను రెగ్యులర్‌గా చేసే పాత్రలకు భిన్నమైన పాత్రలను వాటిలో చేశాను. అలాంటి పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. మంచి కథలతో వస్తే పారితోషికం గురించి కూడా పట్టించుకోను అంది.


Click it and Unblock the Notifications











