అనుష్క ఇప్పుడు తన పారితోషికం సగానికి పైగా తగ్గించానంటూ చెబుతోంది. 'సూపర్' సినిమా తో పరిచయమై సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ బెంగుళూరు భామ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందిట. విక్రమార్కుడు, లక్ష్యం, అస్త్రం,డాన్, ఒక్క మగాడు ఇలా వరస సినిమాలతో దూసుకుపోయిన ఈ నాజూకు సుందరికి హఠాత్తుగా బ్రేక్ పడింది. డాన్, ఒక్క మగాడు, స్వాగతం సినిమాలు వర్కవుట్ కాకపోవటం, చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న 'అరుంధతి' పూర్తి కాకపోవటం మింగుడు పడటం లేదు. మరో ప్రక్క తన తరువాత వచ్చిన హీరోయిన్లు వరస ఆఫర్లతో ఎదిగి పోతున్నారు. పోని తమిళం లో సెట్ అవుదామంటే అక్కడా అదే పరిస్ధితి. దాంతో సినిమా ఫీల్డులో సక్సెస్ లేక పోతే ఉండే విచిత్ర పరిస్థితి మెల్లిగా అర్దమవుతోంది. అందుకే వెంటనే వ్వూహం మార్చి రెమ్యునేషన్ సగానికి సగం తగ్గించి అవకాశాలు అంది పుచ్చుకునే ప్రయత్నం చేస్తోందిట. ఇది గమనించిన కొంతమంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఫలితమేంటి. ముందే తెలిస్తే అద్భుత ఆఫర్ ఇద్దుము అని నిట్టూరుస్తున్నారట. కరక్టే గాని ఏ సినిమా ఆడుతుందో ముందే తెలిస్తే అదే ఒప్పుకుంటారుగా.