ఆ హీరోయిన్ అందగత్తె..కాదు బాక్సాఫీస్ కొల్లగొట్టే కలెక్షన్ క్వీన్ కూడా..!
అనుష్క అందగత్తె..కాదు బాక్సాఫీస్ కొల్లగొట్టే కలెక్షన్ క్వీన్ అనే చెప్పొచ్చు. అనుష్క ఈ మధ్య తెలుగులో నటించటం తగ్గించేస్తోందనే మాటను ఖండిస్తూ అందులో నిజం లేదని ఇప్పుడు ఏకంగా తెలుగులో కూడా మూడు చిత్రాలలో నటించేస్తోంది. నాగార్జునతో 'ఢమరుకం', వెంకటేష్-మహేష్ బాబుల మల్టీస్టార్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రంపచోడవరంలతో బాటు ప్రభాస్ తో కూడా ఓ చిత్రంలో చేయబోతోంది. ఇవిగాక తమిళంలో వరుసగా మూడు చిత్రాలలో నటించనుంది. వచ్చే రెండేళ్ల దాకా అనుష్క డేట్స్ దొరకకపోవచ్చు.
దీని ప్రకారం చూస్తే అనుష్క రాబోయే సంవత్సరానికి సరిపడా డైరీ ఫుల్‌గా ఉందని తేలింది. కొత్త సంవత్సరం మరికొద్ది రోజుల్లో రానుండగా ముందుగానే అనుష్క తన కొత్త డైరీలను ఇంకా కొనకుండానే ఫుల్ గా నింపేసుకున్నది. ఇక అనుష్క గతంలో నటించిన అరుంధతి లాగా, తను ప్రస్తుతం నటించబోయే చిత్రాలలో ఏ ఒకటో రెండో సినిమాలు హిట్టయితే మరో సంవత్సరం కూడా బిజీగానే ఉంటుంది. రెమ్యునరేషన్ కూడా హిట్టుకు తగ్గ రేంజ్‌లో పెంచేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి అనుష్క కోటి రెమ్యునరేషన్ కు చేరవలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











