విద్యాబాలన్ హిట్ రీమేక్ లో అనుష్క
అనుష్క త్వరలో డర్టీ పిక్చర్ రీమేక్ లో నటించే అవకాశం ఉందని సమాచారం. సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. త్వరలో ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో రీమేక్ చేయాలని ఏక్తా కపూర్ నిర్ణయించుకుందని సమాచారం. అందుకోసం అంతటి ఫెరఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టుగా అనుష్కను భావించి సంప్రదించాలనుకుంటున్నారని తెలుస్తోంది. తమ పిక్చర్ డర్టీగా ఉంటుందని టైటిల్‌లో చెప్పి మరీ ఏక్తాకపూర్ నిర్భయంగా విడుదల చేసిన చిత్రం 'డర్టీ పిక్చర్'లో చేయటానికి అనుష్క ఓకే చేసే అవకాశం ఉందనే చెప్తున్నారు. ఇక అప్పటివరకు హోమ్లీగా కనిపించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో హద్దులు దాటి నటించినా ఆ పాత్రకు ప్రజలు నీరాజనం పెట్టారు... అవార్డులు వరించాయి.
అయితే ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదించి విడుదల చేశారు. కానీ ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందుకు ప్రేరణ వేదం చిత్రంలో సరోజ పాత్ర అని చెప్తున్నారు. 'వేదం'లో వేశ్యగా... భిన్న కోణాలున్న ఈ పాత్రలకు ఆహార్యం, అభినయం పరంగా అనుష్క కనబర్చిన వ్యత్యాసాన్ని వీరు తమ చిత్రంకి ఎస్సెట్ అవుతుందంటున్నారు. అందులోనూ తెలుగు, తమిళ భాషల్లో అనుష్కకి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి... దక్షిణాది 'డర్టీ పిక్చర్'కి అనుష్కే కరెక్ట్ అని కూడా నిర్మాత ఫిక్స్ అయ్యారని ముంబై వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











