నిర్మాతల డబ్బులతో జూదం ఆడినట్టే: అనుష్క...!?
'అరుంధతి" లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి బ్రహ్మాండమైన హిట్ కొట్టినా కానీ అనుష్క ఎందుకనో అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు. పంచాక్షరి విజయవంతమైతే ఆమె మరిన్ని ఆ తరహా చిత్రాలు చేసి ఉండేదేమో కానీ అది ప్లాపవడంతో అనుష్క అలాంటివి పూర్తిగా మానేసింది.
అయితే ఆమెతో అరుంధతిలాంటి భారీ సినిామలు తీయాలని క్యూ కట్టే వారు చాలామందే ఉన్నారు. అయినా కానీ ఎందుకని అనుష్క వారికెవరికీ డేట్స్ ఇవ్వడం లేదు? హీరోలకి యావరేజ్ కంటెంట్ తో అయినా సినిమాని నడిపించగల సత్తా ఉంటుంది. కానీ కథానాయిక ప్రధాన చిత్రానికి అద్భుతమైన కథ కుదరాలి. అన్నీ చక్కగా అమరాలి. అరుంధతిలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. అందుకని మళ్లీమళ్లీ అలాంటి సినిమాలు చేయకూడదు. అలా చేస్తే నిర్మాతల డబ్బుల్తో జూదం ఆడినట్టే.
అందుకే ఎంతమంది అలాంటి ఆఫర్స్ తో వచ్చినా కానీ సున్నితంగా తిరస్కరిస్తున్నాను. మళ్ళీ అరుంధతిలా హిట్టవుతుందనే నమ్మకం కలిగితే తప్ప అలాంటి సినిమాలు చేయను"అంటూ అనుష్క సన్నిహితులలో చెబుతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం. ఇంతగా నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది కనుకే అనుష్క ఇండస్ట్రీ అంతటికీ ఫేవరెట్ హీరోయిన్ అయింది.


Click it and Unblock the Notifications











