'పంచాక్షరి' తరహా చిత్రాలుకు ఫుల్ స్టాప్...అనుష్క
మంచి స్క్రిప్టులేకుండా నేను ఫైట్లు, యాక్షన్ చేస్తే చూసి నవ్వుతారు. ప్రతి చిత్రంలోనూ నేను చేసే తప్పులను గుర్తుంచుకుంటాను. తదుపరి చిత్రంలో ఆ తప్పును సవరించుకుంటాను అంటోంది అనుష్క. ఆమె నటించిన 'పంచాక్షరి' చిత్రం క్రితం వారం రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ ఓరియెంటెండ్ పాత్రను చేసింది. ఈ విషయమై మాట్లాడుతూ...ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల మీద నాకంతగా ఆసక్తి లేదు. 'అరుంధతి తర్వాత అలాంటి కథలు చాలా విన్నాను. కథ డిమాండ్ చేస్తే ఫర్వాలేదు కానీ లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ఫైట్స్ జొప్పించి చేస్తే ప్రేక్షకులు నవ్వుతారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌గారు దేవుడి గెటప్ వేసుకుని బయటకు రాగానే జనాలు ఆయన కాళ్ల మీద పడేవారని విన్నాను. ఇప్పుడు జనాలు అలా లేరు.
అంతెందుకు..'పంచాక్షరి' లో నేను వేసుకున్న అమ్మవారి గెటప్ నే తీసుకోండి..నా గెటప్ చూడగానే నేటి తరం వారు కాళ్ల మీద పడరు సరి కదా..మేకప్ బాగాలేదనో, నగలు సరిగ్గా కుదరలేదనో..ఇలా విశ్లేషించడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో నేను లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఫిక్స్ అయ్యి..అవి కరెక్ట్‌గా లేకపోతే నవ్వుతారు. అందుకే..కథ బాగా స్పెషల్‌గా ఉంటే అప్పుడు చేస్తా. అంతేతప్ప అలాంటి కథ దొరక్కపోతే లేడీ ఓరియంటెడ్ సినిమాల జోలికి వెళ్లను అంది. సాంకేతిక పరంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. మనం పాత్ర గురించి మాత్రం మాట్లాడుతుంటాం. కానీ ప్రేక్షకులు గ్రాఫిక్స్ బాగా లేవనీ, కెమెరా యాంగిల్ కరెక్ట్ కాదని అంటున్నారు. అంత ముందంజలో ఉన్నారు వారు. అందుకే లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేయనంటోంది. అదీ పంచాక్షరి ఎఫెక్ట్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











