»   » దర్శన్ 'డార్లింగ్' కాజల్ కాదు..అనుష్క..!?

దర్శన్ 'డార్లింగ్' కాజల్ కాదు..అనుష్క..!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    తెలుగులో ప్రభాస్, కాజల్ జంటగా నటించిన 'డార్లింగ్" చిత్రం కన్నడంలో 'బుల్ బుల్" పేరిట రీమేక్ కానుంది. దర్శన్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో అనుష్కను కథానాయికగా నటించమని కోరారట. కానీ అనుష్క భారీ పారితోషికం డిమాండ్ చేసిందని వినికిడి. ఒకవేళ నిర్మాత కనుక ఆ పారితోషికం ఇచ్చి అనుష్క ను తీసుకుంటే అప్పుడు కన్నడ రంగంలో అధిక పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ అనుష్కే అంటున్నారు సాండిల్ వుడ్ ఫిల్మి ఇండస్ట్రీలో.

    కాగా మొదట కన్నడ డార్లింగ్ గా కాజలే తొలిసారి కన్నడంలో యాక్ట్ చేయడానికి ఒప్పుకొందని సమాచారం. తెలుగులో ప్రభాస్ సరసన 'డార్లింగ్" నటించిన కాజల్ కన్నడ రీమేక్ లో నటింపచేయాలని చూసిన హీరో దర్శన్ కి నిరాశే ఎదురైంది. టాలీవుడ్, బాలీవుడ్, లో బిజీగా ఉన్న కాజల్ ప్రస్తుతం కన్నడ సినిమా చేయడానికి ఇష్టపడక డేట్స్ కాలీ లేవని చెప్పడంతో సదరు నిర్మాత అనుష్కకు కమిటైనట్టు సమాచారం. అలా శాండిల్ వుడ్ లో కాజల్ క్రేజ్ కి అనుష్క చెక్ పెట్టిందని ఇండస్ట్రీలో టాక్.

    స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తికాలేదని..ప్రస్తుతం దానిమీదే పనిచేస్తున్నామని దర్శకనిర్మాతలు శ్రీదర్ యండి, దినకర్ లు తెలిపారు. అలాగే ప్రస్తుతం దర్శన్ తన క్రేజీ ప్రొజెక్ట్స్ సంగోల్లి రాయన్న అన్న చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారని ఆ చిత్రం పూర్తి అవ్వగానే అనుష్క, దర్శన్ ల డార్లింగ్ సెట్స్ పైకి వెలుతుందని..దర్శకుడు తెలిపారు.

    English summary
    If reports are to be believed, Anushka is all set to make her Sandalwood debut soon! The actress might be part of Challenging star Darshan's forthcoming Bulbul, remake of the Telugu hit Darling which starred Prabhas and Kajal Aggarwal in the lead, sources said.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more