అందాల ఆరబోత-అనుష్క ధీరత
ప్రస్తుతం మార్కెట్లో అనుష్క సినిమాలేం ఆడటం లేదు. కానీ మున్మందు విడుదల కానున్న సినిమాలలో హవా అంతా అనుష్కదే అని అనుకుంటున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న డాన్, ఒక్క మగాడు సినిమాలలో అనుష్క అందాల పంట పండించినట్టు సమాచారం.
అందాలను ఆరబోయడంలో ఆరితేరిన యోగా టీచర్ అనుష్క, సంక్రాంతికి విడుదల కాబోతున్న డాన్, ఒక్క మగాడు సినిమాలలోనూ పొదుపైన దుస్తులు వేసుకుందట. తన అందాలన్నిటినీ కనువిందు చేయనుందట. పాటలలో ఈ పొదుపు మరీనట. అభిమానులకు పండగేనట. 2005లో నాగార్జున సూపర్ సినిమాతో రంగప్రవేశం చేసిన అనుష్క అనతికాలంలో అగ్రస్థాయికి చేరుకుంది. సుమంత్, గోపిచంద్, రవితేజ తదితరులతో అనుష్క జోడీ కట్టింది. సినిమాలలో నటించడంకంటే వ్యక్తిగత విషయాలతోనే అనుష్క ఎక్కువగా వార్తలకు ఎక్కుతోంది. స్వాగతం సినిమాలోనూ ఎద అందాలను కనువిందు చేయబోతోంది. జగపతిబాబు హీరోగా ఆ సినిమా రూపొందబోతోంది. డైరెక్టర్ కోరాలే కానీ అందాలను ఆరబోయడానికి అనుష్క ఎంత మాత్రం వెనకాడదు.


Click it and Unblock the Notifications











