అనుష్క రోజూ అతనితో కలిసే జిమ్ కి...
అనుష్కకి ఇప్పుడు గణేష్ వెంకట్రామన్ రూపంలో మరో స్నేహితుడు దొరికాడు.యోగా టీచర్ అయిన అనుష్కకి,మార్షిల్ ఆర్ట్స్ లో స్పెషలిస్టు అయిన గణేష్ కి మంచి ప్రెండ్ షిప్ కుదింది.వీరిద్దరూ శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఢమరుకం చిత్రంలో చేస్తున్నారు.ఇక వీరిద్దరూ ఖాళీ దొరికినప్పుడల్లా ఫిటెనెస్ గురించే చర్చించుకుంటున్నారని యూనిట్ సబ్యులు చెప్తున్నారు.అలాగే అనుష్కకి అతను కొన్ని ఫిట్ నెస్ కి చెందిన వ్యాయామాలు నేర్పితే,అనుష్క అతనికి యోగా తో ఫిటెనెస్ గా ఎలా ఉండాలో నేర్పుతోందని చెప్తున్నారు.ఇలా ఇద్దరూ ఒకరుకి మరొకరు తమకు వచ్చిన విద్యను ఇచ్చిపుచ్చుకుంటూ దగ్గర అవుతున్నారు.ఇద్దరూ షూటింగ్ అవగానే ఒకే జిమ్ కి వెళ్లి అక్కడ ఫిటెనెస్ పాఠాలను ప్రాక్టీస్ చేస్తున్నారు.
గణేష్ వెంకట్రామన్ మరెవరో కాదు... త్రిష హీరోయిన్ గా దిల్ రాజు నిర్మించిన 'ఆకాశమంత' చిత్రంలో నటించాడు. ఇప్పుడు అనుష్క ఢమురకం చిత్రంలో కీలకమైన పాత్ర చేస్తున్నాడు. అనుష్కను ప్రేమిస్తూ వెనకపడి, నాగార్డున కు అడ్డుపడే పాత్ర అది. నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనుష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు.
దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ... గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











