»   » నాగచైతన్యతో రహస్య నిశ్చితార్దం ఏమటని ఆమె మండిపడుతోంది

నాగచైతన్యతో రహస్య నిశ్చితార్దం ఏమటని ఆమె మండిపడుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున కుమారుడు నాగచైతన్య, అనుష్కలకు నిశ్చితార్ధం జరిగిందని ఈ రోజు మీడియాలో ఎక్కడ చూసినా వార్తలే. దాంతో అనుష్క ఈ విషయమై మండిపడుతోందని చెప్తున్నారు. నాగార్జున మాత్రం దీనిపై నో కామెంట్ అన్నట్లు ఉండమని, మ్యాటర్ ని పద్దది చేసినట్లు అవుతుందని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ న్యూస్ కు ఆధారంగా ఒక తమిళ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించినట్లు కధనాలు వస్తున్నాయి.

అంతేగాక అనుష్క,నాగాచైతన్య గత కొంతకాలంగా ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగుతోంది.దానికి కారణం నాగచైతన్య యోగా గురువు అనుష్క కావటమే. ఆమె వద్దనే యోగా నేర్చుకున్న నాగచైతన్య ఆమెను తన తండ్రికి పరిచయం చేస్తే ఆయన పూరీకి పరిచయం చేసి సూపర్ సినిమాలో పరిచయం చేయించాడు. అంతేగాక ఈ మధ్య నాగార్జునతో ఆమెకు ఎఫైర్ ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఐటీ రైడ్స్ బయిట పడినప్పుడు ఆమెను తన భార్యగా చూపాడంటూ కూడా వినపడింది.

ఇవన్నీ ఇలా ఉంటే కొంతకాలం క్రితం అనుష్క తాను ప్రేమలో పడ్డానని అన్నప్పుడు ఆ వ్యక్తి డైరెక్టర్ క్రిష్ అని ప్రచారంలోకి వ్చచిందచి. అయితే ఆయన కాదని అనగానే ఆ వ్యక్తి నాగచైతన్య అని. వీరిద్దరి ప్రేమకు ఇరువైపుల తల్లిదండ్రులు ఒప్పుకున్నారని, ఆ మీదట వారి నిశ్చితార్ధం రహస్యంగా జరిగిందని పరిశ్రమలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో, అబద్దం ఎంతోతెలియదు కాని, తమిళపత్రికలు, పలు వెబ్ సైట్ లలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇక అనుష్క వివిధ భాషలలో మంచి నటిగా, గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని దూసుకుపోతోంది. అలాగే నాగ చైతన్య ఇప్పుడిప్పుడే రాణిస్తున్న నటుడు. ఒక వేళ ఇది నిజమైతే నిశ్చితార్ధం రహస్యంగా చేయవలసిన అవసరం ఉందా అన్నది కూడా ప్రశ్న.

English summary
The entire South Indian film industry is shocked over the buzz flashing all over the place that Anushka Shetty is engaged to Nagarjuna’s son Naga Chaitanya. Reports reveal that the engagement ceremony was a private affair that was attended by family members and close relatives from both sides.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu