అనుష్కా డార్లింగ్..నీకిది తగునా?
అరేబియన్ గుర్రంలా అందమైన షేపులు, కత్తిలాంటి ఫిగర్ ఆమె సొంతం. అందకే ఆమంటే పడి చస్తారు అభిమానులు. ఆవిడ ఎవరో కాదు...అరుధంతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చితస్థాయిగా నిలిచి పోయి హాట్ హీరోయిన్ అనుష్క. అందకే అనుష్కకు చాలా మంది వీర ఫ్యాన్స్ ఉన్నారు. అందు తమ అబిమన నటిని డార్లింగ్ అని పిలుస్తూ తమలో తాము ఆనంద పడిపోయేవారూ ఉన్నారు. ప్రస్తుతం అనుష్క అభిమానులు ఆమెపై ఆగ్రహంగా ఉన్నారు. డర్లింగ్ నీకిది తగునా అంటూ మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూడా...
రగడ సినిమా తర్వాత అనుష్క మళ్లీ తెలుగు తెరపై కనిపించింది లేదు. దీంతో అనుష్క ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో అనుష్క హవా నడుస్తోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఇరండమ్ ఉలగమ్" చిత్రం జనవరిలో ప్రారంభంకానుంది. విక్రమ్ హీరోగా నటిస్తున్న 'తాండవం" చిత్రం కూడా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. దాంతో పాటు కార్తీ హీరోగా నటించిన 'శకుని" చిత్రంలో అనుష్క ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. 'బిల్లా 2 " చిత్రంలో అజిత్ సరసన, 'సింగం2" లో సూర్య సరసన కూడా అనుష్క నటించనుంది.
దీంతో ఆ సినిమాలకు సంబంధించిన డేట్స్ ఎడ్జెస్ట్‌మెంట్‌తో బిజీగా ఉన్న అనుష్క...తెలుగు సినిమాలను, ఇక్కడి అభిమానులను పట్టించుకోడమే మానేసింది. తెలుగులో అనుష్క ప్రస్తుతం నాగార్జున సరసన 'డమరుకం", చైతన్య దంతులూరి దర్శకత్వంలో 'రంపచోడవరం" చిత్రంలో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించే 'కృష్ణం వందే జగద్గురుం" చిత్రంలో కథానాయికగా కన్‌ఫర్మ్ అయ్యింది. అయితే ఇవన్నీ పూర్తయి తెరపైకి రావడానికి చాలా కాలం కానుంది. అందుకే అభిమానులు ఆమెపై చాలా గుర్రుగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











