అల్లు అర్జున్ ని ప్రక్కన పెట్టి అనుష్కనే హైలెట్ చేస్తూ !?
సాధారణంగా అల్లు అర్జున్ వంటి స్టార్ సినిమాలో ఉన్నప్పుడు అతని మీద ఎక్కువ కాన్సరటేషన్ చేస్తూ పబ్లిసిటీ చేస్తూండటం కామన్. కానీ చిత్రంగా వచ్చే నెల నాలుగవ తేదీన విడుదల కానున్న 'వేదం' చిత్రానికి మాత్రం అనుష్క మీద ఎక్కువ ఆధారపడినట్లున్నారు. 'వేదం' గురించి ఉందంటే ప్రక్కన అనుష్క...వేశ్య గెటప్ లో ఉన్న ఫొటో కనపడుతుంది. అలాగే ట్రైలర్స్ లోనూ అనుష్క డైలాగుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఆమె అమలాపురం సరోజ గా మాస్ ని ఆకట్టుకుని జనాల్ని ధియోటర్స్ కు లాగుతుందనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారని చెప్తున్నారు.
ఇక అల్లు అర్జున్ కి పూర్తి ప్రయారిటీ ఇస్తే కో స్టార్ మంచు మనోజ్ ఫీలయ్యే ప్రమాదం ఉందని, అదొక కారణమని అంటున్నారు. తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు రావటమే తక్కువ. అలాంటి సిట్యువేషన్ లో ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా అభిమానులు మాట ఎలా ఉన్నా హీరోల తండ్రులు నుంచి వచ్చే ఫోన్స్ ని తట్టుకోవటం కష్టంగా ఉంటుందంటున్నారు. 'వేదం' చిత్రంలో కేబుల్ రాజాగా అల్లు అర్జున్, రాక్ స్టార్ విజయ్ చక్రవర్తిగా మనోజ్ నటించారు. అమలాపురం సరోజగా అనుష్క అదరకొట్టనుంది. 'గమ్యం' ఫేం జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో ఆర్కా మీడియా పతాకంపై ప్రసాద్ దేవినేని, యార్లగడ్డ శోభు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











