Don't Miss!
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఒకరితో చెప్పించుకొనే స్థితిలో లేను: అనూష్క
హైదరాబాద్ :నలుగురి మధ్య ఉన్నప్పుడు అందుకు తగ్గట్టు నడుచుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఉన్న పరిస్థితుల్ని బట్టి మెలగడం ఎలాగో మొదట్లో నాకు తెలియకపోయినా నెమ్మదిగా అలవాటైంది. ఇప్పుడైతే ఒకరితో చెప్పించుకొనే స్థితిలో లేను అని చెప్పింది అనూష్క. అనుష్క నటించిన 'మిర్చి' విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.
ప్రభాస్ హీరోగా రచయిత కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం 'మిర్చి' . ఈ చిత్రం పిబ్రవరి 7న రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్క రోజు తేడాగా అంటే పిప్రవరి 8న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లు.
ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ ' ఈ సినిమాలో ప్రభాస్ వైవిధ్యమైన పాత్ర పోషించారు. ఆయన లుకింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తొలిసారిగా ఆయన కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ వ్యయంతో సినిమాని నిర్మించాం. కథ మీద కమాండ్‌తో హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్‌తో దర్శకుడు శివ చిత్రాన్ని రూపొందించారు.
గరం గరం మిర్చి తినడానికి ఎంత బాగుంటుందో అలాగే మా 'మిర్చి' సినిమా చూసి జనం అంత ఎంజాయ్ చేస్తారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సంగీత ప్రియులను అలరిస్తోంది' అని తెలిపారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం'రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్‌కుమార్, ఆదిత్యామీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.