నాగార్జున తొందరపాటు నిర్ణయాలు వద్దని...అనూష్క
అనుభవజ్ఞులైన హీరోతో పని చేయడం వల్ల త్వరగా నేర్చుకొనే వీలు చిక్కింది. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్లంతా నన్ను బాగా ఎంకరేడ్ చేసారు.నాగార్జున నన్ను తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని ఎప్పుడూ చెప్పేవారు అంటూ చెప్పుకొచ్చింది అనూష్క.ఆమె తన హీరోలతో అనుభవాల గురించి మాట్లాడుతూ ఇలా స్పందించింది.అలాగే తమిళ హీరోలు సూర్య, విక్రమ్, విజయ్‌ల పని తీరు కూడా నాకు బాగా నచ్చింది. సూర్యలో మంచి తండ్రి కనిపించాడు. కెమెరా ముందుకు వెళ్లగానే పాత్రలో పరకాయ ప్రవేశం ఎలా చేయాలో విక్రమ్ నుంచి నేర్చుకొన్నాను అంది.అలాగే అన్నిటికన్నా ముఖ్యం సలహాలు ఇచ్చిపుచ్చుకొంటే తొందరగా నేర్చుకొనే వీలు చిక్కుతుంది అంది.ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ సరసన,ప్రభాస్ సరసన రెబెల్ చిత్రంలోనూ చేస్తోంది.అలాగే నాగార్జునతో ఆమె 'డమరుకం" చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











