ప్లీజ్..అలాంటివి వద్దు: అనూష్క
అరుంధతి విజయం అనంతరం తనకన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయని..దయచేసి అలాంటి పాత్రలతో తన దగ్గరకి రావద్దని చెప్తోంది అనూష్క. బిల్లా చిత్రంలో బికినీ వేసుకుని సంచలనం సృష్టిద్దామని ప్రయత్నించి ఫెయిలయిన అనూష్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ ప్లాన్స్ చెప్పుకొచ్చింది. 'టిక్ టిక్ టిక్' అనే సినిమా ఆడియో ఫంక్షన్ కి హాజరైన అనుష్క ఒకే తరహా పాత్రలు పోషించడానికి తాను ఎప్పుడూ అంగీకరించనని చెప్పింది.
వైవిధ్యమైన పాత్రలను పోషించాలనే ఉద్దేశంతోనే 'అరుంధతి' చేశానని, తరచూ అలాంటి పాత్రలే చేస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుందని సమాధానమిచ్చింది.'అరుంధతి' చిత్రం అఖండ విజయం సాధించాక మళ్లీ అదే తరహా సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులను ఆకట్టుకోలేని ఆమె అంటోంది. ప్రస్తుతం తాను తమిళ హీరో విజయ్ సరసన 'వేట్టైక్కారన్'లోనూ, సూర్యకు జంటగా 'సింగం' లోనూ నటిస్తున్నానని వెల్లడించింది. 'బిల్లా'లో బికినీ ఎక్స్‌పోజింగ్ గురించి ఆమె బదులిస్తూ అది అంత ఎబ్బెట్టుగా ఏమీ లేదని, అయినా దానిపై ఇప్పుడు మాట్లాడడని దాట వేసింది.


Click it and Unblock the Notifications