వేశ్యగా అనుష్క హాట్ డైలాగ్ సూపర్
'ఏ ఉద్యోగానికైనా ఎంత అనుభవం ఉంటే అంత ఎక్కువ డబ్బులిస్తారు. కానీ మా ఉద్యోగానికి అనుభవం ఎంత తక్కువుంటే అంత ఎక్కువ డబ్బులిస్తారు...' అంటూ అనుష్క తాజా చిత్రం 'వేదం'లో డైలాగ్ చెప్తుంది. ట్రైలర్స్ లో చూపెడుతున్న ఈ డైలాగ్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. అందులో ఆమె పాత్ర గెటప్, డైలాగ్ ను బట్టి ఈ క్యారెక్టర్ ఆమెకు అవార్డు తెచ్చిబెట్టటమే కాక మాస్ లోకి బాగా సినిమా వెళ్ళే అవకాశాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ పాత్రను గురించి అనుష్క మాట్లాడుతూ.."సరోజ అనే వేశ్య పాత్ర ఉంది, ఆ పాత్ర చిత్రణ ఇలా ఉంటుంది..అది నువ్వు చేస్తే బావుంటుంది' అని దర్శకుడు జాగర్లమూడి రా ధాకృష్ణ(క్రిష్) చెప్పగానే...ఏ మాత్రం ఆలోచించకుండా...ఆ పాత్ర నేను చేస్తానన్నానని ఆమె చెప్తోంది అనుష్క.
అలాగే అద్భుతంగా ఆ పాత్రను రక్తికట్టించారని క్రిష్ చెబుతున్నారు. 'వేదం' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో క్రిష్ మాట్లాడుతూ-"ఇందులో సరోజ పాత్రను అనుష్క చేసిన విధానం నభూతో నభవిష్యత్. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారామె. రేపు ఒక గొప్ప నటిని తెరపై ప్రేక్షకులు చూడబోతున్నారని నిస్సందేహంగా చెప్పగలను. ఆమె గొప్ప నటి మాత్రమే కాదు...గొప్ప సంస్కారవంతురాలు. షూటింగ్ జరిగిన ఇన్నాళ్లల్లో ఆమె మమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటన ఒక్కటి కూడా లేదు. తన సొంత సినిమాలా ట్రీట్ చేస్తూ...ఈ పాత్ర చేశారామె. ఆమెలోని సంస్కారాన్ని చూస్తే మా అమ్మ గుర్తుకొచ్చింది. మా అమ్మ తర్వాత నా మనసులో అంతటి స్థానం సంపాదించారు అనుష్క' అన్నారు.


Click it and Unblock the Notifications











