For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్కా...ఇంతలా చూపెడతే కుర్ర హీరోలు వెంటబడరా?(హాట్ ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : నాకు తెలుసు ఈ రోజు టాలీవుడ్ లో నేనెంత హాట్ ప్రాపర్టీనో.. అంటూ గర్వంగా చెప్పుకునే అనుష్క...ఏజ్ పెరుగుతుంటే అందాలు మరింత ఆకర్షణీయంగా పెరుగుతున్నాయి. తన కెరెర్ లో సక్సెస్ సీక్రెట్ ని చెప్తూ... ఏ సినిమా పడితే అది ఒప్పుకోవటం చేయను. నా దృష్టి అంతా స్క్రిప్టు మీదే. అలాగే ఎంత బిజీగా ఉన్నా నేను నా బెస్ట్ ఇస్తూనే ఉంటాను అంటోంది అనూష్క.

  అరుంధతి విజయంతో అందరి దృష్టి అనూష్క మీదే ఉంది. పెద్ద పెద్ద సంస్ధలు, హీరోలు అంతా ఆమెనే తమ ప్రాజెక్టులో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయం గురించి అనూష్క మాట్లాడుతూ...నేను యాక్టర్ ను కాకపోయింటే మంచి టీచర్ ని అయ్యుండే దాన్ని. నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది..ఇన్ని పెద్ద ప్రాజెక్టులు నాదగ్గరకు రావటం. ఇది ఊహించనది.

  అనుష్క మాట్లాడుతూ.. ప్రస్తుతం కెరీర్‌ సంతృప్తికరంగా సాగుతోంది. 'మిర్చి' ఘన విజయం సాధించటం, గుణశేఖర్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమవటం, సూర్యకు జంటగా మరోసారి అవకాశం రావటం నాకు కలిసొస్తున్న విషయాలని చెప్పింది.

  పరిశ్రమను ఇంతలా ఎట్రాక్ట్ చేస్తున్న ఆమె అందాలు స్లైడ్ షో లో...

  అసలు నా సినీమా ఎంట్రీనే నేనెప్పుడూ అనుకోలేదు. నేను భరత్ ఠాకూర్ వద్ద ఓ యోగా టీచర్ అంతే. అయితే నా కెరీర్ ఇంతలా మలుపు తిరుగుతుందని ఏనాడూ కలలో కూడా ఊహించలేదు అంది.

  రెమ్యునేషన్ గురించి మాట్లాడుతూ...నా కెంత ఇస్తే సరిపోతుందనుకుంటున్నానో అదే చార్జ్ చేస్తున్నాను. నాకు తెలుసు ఆ రెమ్యునేషన్ అంత ఎక్కువ కాదు అని. అయినా ఇక్కడ కష్టపడి రూపాయి సంపాదించుకుందామనే కదా పరిశ్రమకు వస్తారు అంతా అంటూ తెలివిగా సమాధాన మిచ్చింది.

  ఇక బాలీవుడ్ ఆఫర్స్ గురించి మాట్లాడుతూ..ఇప్పటి వరకూ రాలేదు.ఏమో భవిష్యత్ లో వస్తాయేమో. ఎందుకంటే నేను గ్లామర్, డీ గ్లామర్ సబ్జెక్టులు రెండింటికీ పనికొస్తాను కదా అంది.

  కహానీ రీమేక్‌ చిత్రంలో నటించమని శేఖర్ కమ్ముల నన్ను అడిగారు. కాల్షిసట్‌ స ర్దుబాటు కాక చేయలేదు. అయినా అన్ని సినిమాలకు నేనే చేయాలని లేదు కదా.

  ప్రస్త్తుతం రుద్రమదేవి, బహుబలి సినిమాలు ఒప్పుకున్నాను. వాటిపైనే దృష్టి పెట్టాలి.

  ఒక సినిమా అంగీకరించే ముందు కథకే ప్రాధాన్యతనిస్తాను. కథ ప్రకారమే పాత్రలు ఉంటాయి.

  ఇక కాంబినేషన్‌ సినిమాలంటే తొలుత స్కిప్ట్‌ బావుండాలి అప్పుడే అవి విజయం సాధించే అవకాశం ఉంటుంది అని అనుష్క పేర్కొంది.

  ఇక నా పెళ్లి విషయంలో మా అమ్మా, నాన్నా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇందులో వాళ్ల ప్రమేయం పెద్దగా ఉండదు. నేను ‘ఓకే' అన్నప్పుడే వాళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు.

  అంతే తప్ప... నన్ను ఇబ్బంది పెట్టి పెళ్లి చేయరు. కెరీర్ మంచి స్పీడ్ మీద ఉన్న టైమ్‌లో ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకొనే అమాయకురాలిని కాదు నేను అంటోంది అనుష్క.

  'యముడు-2' తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని బొమ్మాళి అనుష్క చెబుతోంది. తెలుగులో ప్రభాస్‌కు జంటగా ఆమె నటించిన సినిమా 'మిర్చి'. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

  కన్నడ భామ అనుష్క శెట్టి తెలుగు,తమిళ సినీ ప్రేమికుల కలల దేవత. బెంగుళూరు నగరానికి చెందిన అనూష్క యోగా శిక్షకురాలుగా కెరీర్ ప్రారంభించి,నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది.

  తమిళంలో ప్రస్తుతం సూర్య సరసన 'సింగం-2'లో ఆడిపాడుతోంది. హరి దర్శకత్వంలో గతంలో వారిద్దరూ జంటగా వచ్చిన 'సింగం' చక్కటి ఫలితాన్ని నమోదు చేసింది. దీనికి కొనసాగింపుగా రెండో భాగం సిద్ధమవుతోంది. హన్సిక మరో హీరోయిన్.

  Read more about: anushka అనుష్క
  English summary
  Anushka debuted in the 2005 Telugu film Super and rose to fame following her performance in Vikramarkudu (2006). She received high critical acclaim for her portrayal of the titular character in Arundhati and as Saroja in Vedam which fetched her two Filmfare, one Nandi and two CineMAA Awards. After starring in
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X