అనుష్క ని ఒకే ఒక్క ఛాన్స్ అడిగిన వీరాభిమాని...
ఒక అభిమాని తన పై చూపిస్తోన్న కేర్ చూసి ముచ్చట పడిపోయింది అనుష్క ఇంతకీ విషయం ఏంటంటే సాప్ట్ వేర్ రంగంలో సెటిలైన ఓ యువకుడు రీసెంట్ గా అనుష్కని కలిసి ఆమెకు వీరాభిమానిగా తనను తాను పరిచయం చేసేసుకుని, ఆపై ఓ ఛాన్స్ అడిగేశాడు. ఆ ఛాన్స్ ఏంటో తెలుసా..?
అతను కేవలం అనుష్క కోసం ఓ వెబ్ సైట్ ని డిజైన్ చేసే ఛాన్స్ అడిగాడట. అంతే కాదు, అక్కడికక్కడే తన ల్యాప్ టాప్ ఓపెన్ చేసి డెమో కూడా చూపించేశాడట. ఇంకేముంది..తన ఫ్యాన్ స్పీడ్ చూసి ఇంప్రెస్ అయిపోయిన అనుష్క అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చెయ్యడమే కాకుండా స్పెషల్ గా ఫోటో షూట్ చేయించుకుని ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ ఇస్తాననీ, ఎప్పటికప్పుడు తన కెరీర్ వివరాలను తెలుపుతాననీ ప్రామిస్ చేసేసింది. అలా అనుష్క నింపిన ఉత్సాహంతో ప్రస్తుతం ఆమె వెబ్ సైట్ ని రెడీ చేసేస్తోన్న ఆ అభిమాని అతి త్వరలోనే దాన్ని లైవ్ లోకి తీసుకురానున్నాడని తెలిసింది.


Click it and Unblock the Notifications











