అనుష్కతో మేకప్ మేన్ చంద్ర భారీ చిత్రం
'అరుంధతి" గా సంచలన విజయాన్ని సాధించిన అనుష్క ప్రధాన పాత్రలో ఓ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం డిసెంబర్ 11 న ప్రారంభం అవుతోంది. 'కింగ్" నాగార్జున పర్సనల్ మేకప్ మేన్ చంద్ర నిర్మాతగా మారి పతాకంపై ఈ ప్రస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నారు. ఉత్తమ రూపశిల్సిగా సీతారామరాజు, అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు అందుకున్న 'చంద్ర" నిర్మాతగా సెన్సేషనల్ హిట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత చంద్ర మాట్లాడుతూ..'అనుష్క ప్రధాన పాత్రలో అరుంధతి" తర్వాత వస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం ఇది.
అద్భుతమైన కథలో అనుష్క కెరీర్లో మరో సంచలన చిత్రంగా ఈ చిత్రం రూపొందుతుంది. డిసెంబర్ 11 నుంది ఫిబ్రవరి నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్ తో నిర్మాణం పూర్తవుతుంది. ఈ చిత్రంలో నటించే మిగిలిన తారాగణాన్ని, సాంకేతికవర్గాన్ని అతి త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు. 'అరుంధతి" కనీవినీ ఎరుగని అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో అనుష్కతో చంద్ర నిర్మిస్తున్న చిత్రానికి ఆల్రెడీ బయ్యర్స్ నుండి భారీ ఆఫర్స్ రావడం విశేషం.


Click it and Unblock the Notifications











