బన్నీఉన్నాడనే అనూష్క
మా చిత్రంలో అల్లు అర్జున్ ఉన్నాడని తెలియగానే అనుష్క మరో మాట లేకుండా అంగీకారం తెలిపిందంటూ క్రిష్ చెప్పుకొచ్చారు. తన లేటెస్ట్ పార్జెక్టు వేదం సినిమాలో పాత్రకు ఆమె ఒప్పుకున్న విధానం గురించి క్రిష్ చెపుతూ..'స్క్రిప్టు విన్న అనుష్క ఏ విషయం చెప్పడానికి కొంత సమయం తీసుకుంది. అయితే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నట్టు తెలియగానే వెంటనే తన అంగీకారం తెలియచేసింది. అరుంధతి, వంటి రెండు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన అనుష్క ఈ సినిమా ఒప్పుకోవడం చాలా ఎగ్జయిటింగ్ కలిగించింది' అన్నారు.
అలాగే బెస్ట్ స్క్రిప్టులలో 'వేదం' కూడా ఒకటనీ, చిన్న ప్రాజెక్ట్ గా మొదలై బిగ్ కేన్సావ్ ను సంతరించుకుందంటే ఆ క్రెడిట్ అల్లు అర్జున్ కే దక్కుతుందని అన్నారు. ఇందులో ప్రధానంగా మూడు లీడ్ క్యారెక్టర్లు ఉన్నప్పటికీ, ప్రతి క్యారెక్టర్ కూ ప్రత్యేకత ఉంటుందనీ, జూన్ మధ్యలో హైద్రాబాద్ లో షూటింగ్ మొదలవుతుందనీ క్రిష్ చెప్పారు. ఇక ఈ ప్రాజెక్టు ఇంత పెద్దగా మారిన విధానం చెపుతూ 'కొత్త నటీనటులతో సినిమా తీయాలని అనుకుంటున్న విషయాన్ని మాటల సందర్భంలో అల్లు అర్జున్ తో ముచ్చటించాను.
ఆయన కథ చెప్పమని అడిగారు. సుమారు 15 నిమిషాల పాటు కథ వినిపించాను. ఆయన వెంటనే మనమే చేద్దాం అన్నారు. ఆ రోజు నించి రెండు నెలల పాటు కూర్చుని పూర్తి స్క్రిప్టు రెడీ చేశాను. మళ్లీ ఆయనకు బౌండ్ స్క్రిప్టు ఇచ్చాను. మరో హీరో ఎవరైతే బాగుంటారని ఆయనను అడిగినప్పుడు మనోజ్ పేరును ఆయన సూచించారు. వెంటనే మనోజ్ ను సంప్రదించి స్టోరీ వినిపించాను. వెంటనే ఆయన తన అంగీకారం తెలియజేశారు' అని క్రిష్ వివరించారు.


Click it and Unblock the Notifications











