సీరియల్స్ లోనూ..అనూష్క
ఏమో తప్పు లేదనిపిస్తే సీరియల్లలోనూ తళుక్కున మెరుస్తాను. అప్పటికి పరిస్థితులు, పరిసరాలే నాకు ముఖ్యం అంటోది టాప్ హీరోయిన్ అనూష్క. తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ నాకు ఏ క్షణం ఏమి చేయాలనిపిస్తే అది చేస్తాను. నేనింతే అని భీష్మించుకుని కూర్చునే తత్వం నాకు అలవాటు లేదు. ఆ తరహా పాత్రలు నాకు సరిపోవు..నేను ప్రత్యేక పాటల్లో నటించను. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల మధ్య నన్ను నేను ఊహించుకోలేను.. వంటి మాటలు నా వ్యక్తిత్వానికి సరిపడవు. అందుకే పరిధులు గీసుకుని తమకు తాము సంకెళ్లను వేసుకునేవారిని చూస్తే నాకు వింతగా అనిపిస్తుంది అంటోంది ఆమె. అరుంధతి విజయానంతరం అనూష్క ఎదిగిపోయింది..నిర్మాతలను లెక్క చేయటం లేదు..ఎక్కువ రెమ్యునేషన్ డిమాండ్ చేస్తోంది..అంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. అంటే ఆసక్తి ఉన్న టీవీ నిర్మాతలు ఆమెను సంప్రదించినా ఆమె పెద్ద ఫీలవదన్నమాట.


Click it and Unblock the Notifications











