సైలంట్ కిల్లర్ అనూష్క?
అరుంధతి విజయానంతరం అనూష్కకి నటనలో పేరు వచ్చి డిమాండ్ పెర్గితే, బిల్లా రిలీజ్ తర్వాత ఆమెకు సైలెంట్ కిల్లర్ అనే బిరుదు వచ్చింది. తన బికినీ అందాలతో, చూపులతో ప్రేక్షకులను కిల్ చేసిందని అంతా ఆమెకు ఫోన్ చేసి పొగుడుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సన్నిహితులుతో చెప్పుకుని ఎంజాయ్ చేసిందని తెలుస్తోంది. అలాగే ఆమెను అలా అనటానికి కారణం కూడా..సెట్స్ లో తన పనితప్ప వేరే విషయాల జోలికి వెళ్ళకపోవటమేనంటున్నారు.
స్వీటీ అనే ముద్దు పేరు ఉన్న ఆమె చాలా ప్రొపిషనల్ గా వ్యవహరించటం వల్లే వరస ఆఫర్స్ వస్తున్నాయని, అందుకే దర్శకులు ఆమెతో చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు. సెట్లో సైలెంట్ గా ఉండటం రీటేక్స్ ఎక్కువ లేకపోవటం ఆమె ప్లస్ పాయింట్స్ గా చెప్తున్నారు. అలాగే శరీరాన్ని అదుపులో పెట్టుకోవటంలో ఆమె పక్కాగా ఉంటుందని, చాలా మంది హీరోయిన్స్ సగం సినిమా పూర్తయ్యేసరికి షేప్ తేడా వస్తుందని, కంటిన్యుటీ దెబ్బతింటుందనే భయంతో ఆ తర్వాత వర్క్ చేస్తామని, అనూష్కతో ఆ ప్రమాదం ఉండదని అంటున్నారు. ప్రస్తుతం అనూష్క..మహేష్ ప్రక్కన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోంది. మరో రెండు తమిళ చిత్రాల్లోనూ చేస్తూ దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











