చిరు కన్నా అనూష్కే బెటర్?
మొగాస్టార్ ఇమేజ్ ఉన్న చిరంజీవి కన్నా కొత్తగా స్టార్ డమ్ తెచ్చుకున్న అనూష్కే బెటర్ అని కోడిరామకృష్ణ కామెంట్ చేసినట్లు వినపడుతోంది. తన సన్నిహితులతో అరుంధతి విజయం ప్రస్తావిస్తూ..ఇంతకు ముందు ఇదే బ్యానర్ (శ్యామ్ ప్రసాద్ రెడ్డి)లో అంజి చేసాను. అందులో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. దాంతో ఎక్సపెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. అయితే అది భాక్సాఫీస్ వద్ద బుడగలా పేలిపోయింది.
అయితే అరుంధతి చేస్తున్నప్పుడు చాలా మందికి రిలీజయి మొదటి షోకే హిట్ టాక్ వచ్చినా డౌట్ గానే ఉంది. అనూష్క ప్రధాన పాత్రలో సినిమా ఆడుతుందా..ఆమె ఏమన్నా సౌందర్య అనుకుని తీసారా అని అందరూ వెనుక కామెంట్ చేసారు. కానీ సూపర్ హిట్ అయి రికార్డులు బ్రధ్దలు కొట్టింది. చిరంజీవి ఉన్నాడు కదా అని ఆ రోజు ఓవర్ కాన్ఫిడెంట్ తో వెళ్ళాం...అదే ఆ రోజు మైనస్ అయింది..అంటూ విశ్లేషించాడుట. అంటే స్టార్ డమ్ కన్నా ఫెర్మాఫెర్మన్స్, స్క్రిప్టు బలం ఎంత గొప్పగా వర్కువుట్ అవుతాయన్నది ఓ సీనిరియ్ దర్శకుడుగా చక్కగా చెప్పాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











