Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నా కలల్లోకి రోజూ అనుష్క...నాగార్జున
హాట్ స్టార్ అనుష్క చేసిన పంచాక్షరి గెటప్ తన కలల్లోకి వస్తోందంటూ నాగార్జున చేసిన కామెంట్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. టబు ప్లేస్ ని అనుష్క రీప్లేస్ చేసిందంటూ గత కొద్ది కాలంగా వినపడుతున్న రూమర్స్ కు ఇదే ఆధారం అని చెప్పుకుంటున్నారు. నాగార్జున ఈ కామెంట్ ను అనుష్క తాజా చిత్రం పంచాక్షరి ఆడియో పంక్షన్ లో స్టేజిపై చెప్పారు. ఆ మాట విన్నప్పుడున అనుష్క మొహంలో సిగ్గు చిందులేసిందని అంటున్నారు. ఇక పంచాక్షరి చిత్రాన్ని నాగార్జున సమర్పిస్తున్నాడు. ఆయనే పరోక్షంగా నిర్మాత అని వినపడుతోంది. ఇక నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు..నాగార్జునకి కెరీర్ ప్రారంభం నుంచి పర్శనల్ మేకప్ మేన్. వరస డిజాస్టర్ చిత్రాలు అందిస్తున్న సముద్ర ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. అరుంధతి లా విజయం సాధిస్తుందని అంతా ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఇక అనుష్క..తన తొలి చిత్రాన్ని నాగార్జున సరసన సూపర్ లో చేసింది. ఆ తర్వాత డాన్ లో హీరోయిన్ గా చేసింది. అనంతరం కింగ్ లోనూ, కేడీ లోనూ గెస్ట్ సాంగ్స్ చేసింది. అంతేగాక భూమిక తకిట..తకిట లోనూ నాగార్జన, అనుష్క ఇద్దరూ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.