అనుష్క హీరోయిన్ కాదు..హీరో : రానా

By Bojja Kumar

హైదరాబాద్: అనుష్క హీరోయన్ కాదు....హీరో అంటూ కామెంట్ చేసాడు యాక్టర్ రానా. సెక్సీ బ్యూటీ అనుష్కను పట్టుకుని ఇంత మాటనేసాడు అనుకుంటున్నారా. అయితే రానా ఆమెను మరో ఉద్దేశ్యంతో చూడటం లేదు కానీ, ఆమెతో కలిసి బాహుబలి, రుద్రమదేవి చిత్రాలకు పని చేసిన అనుభవంతో ఈ మాట అన్నాడట.

ఆమెను కేవలం హీరోయిన్ అంటే నేను ఒప్పుకోను. బాహుబలి, రుద్రమదేవి చిత్రాలకు ఆమె హీరో. బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో ఆమె వారియర్ క్వీన్ పాత్ర పోషించింది. ప్రభాస్, నాతో సమానంగా డాన్సులు, ఫైట్లు చేసింది. అందంతో పాటు ఇలాంటి స్కిల్స్ కూడా ఉండటం అంత సులభం కాదు. అందుకే సౌతిండియాలో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అన్నాడు రానా.

Anushka Is A Hero, Not A Heroine: Rana

అనుష్క టైటిల్ రోల్ చస్తున్న రుద్రమదేవి సినిమా విషయానికొస్తే...అనుష్క టైటిల్ రోల్ లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగినీ గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న అనుష్క పుట్టినరోజు నవంబర్ 7.

ఈ సందర్భంగా నవంబర్ 7న ‘రుద్రమదేవి' మేకింగ్ వీడియోను విడుదల చేయ్యబోతున్నారు. దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ..‘భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతున్న మా రుద్రమదేవి చిత్రానికి సంబంధించి ప్రస్తుతం శరవేగంగా పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ 7 అనుష్క పుట్టినరోజు సందర్భంగా మా చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చెయ్యబోతున్నాం. గతంలో రిలీజ్ చేసిన రుద్రమదేవి ఫస్ట్ లుక్‌కి, అల్లు అర్జున్ చేస్తున్న గోన గన్నారెడ్డి ఫస్ట్‌లుక్‌కి చాలా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అనుష్క పుట్టినరోజున ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నాం' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X