నాటి రాములమ్మ విజయశాంతి..మరి నేటి రాములమ్మ..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా... ఇప్పుడంతా రీమేక్స్ మీదా, సీక్వెల్స్ మీద పడుతున్నారు. వాటికి ప్రేక్షకాదరణ లభిస్తుండడంతో ఫిలిం మేకర్స్ ఆ దిశగా తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బాటలోకి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కూడా వస్తున్నట్టు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.
గతంలో ఆయన విజయశాంతిని ప్రధాన పాత్రలో పెట్టి రూపొందించిన 'ఒసేయ్...రాములమ్మ' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసే యోచన చేస్తున్నారట. అప్పట్లో 'ఒసేయ్...రాములమ్మా' సినిమా సంచలన విజయం సాధించి, విజయశాంతి ఇమేజ్ ను ఎన్నో రెట్లు పెంచింది. ఈ కథకు కొనసాగింపుగా 'రామసక్కని తల్లి' పేరుతో దాసరి అద్భుతమైన కథను తయారుచేసుకున్నారనీ, కథానాయికగా అనుష్కను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది.
అయితే అనుష్కను దృష్టిలో పెట్టుకొనే ఫంక్షన్లకు హీరోయిన్లను పిలవొద్దంటూ మొన్న ఆ మధ్యన వంశీ ఇంటర్నేషనల్ అవార్డు కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు హీరోయిన్లపై మండిపడిన విషయం విధితమే. హీరోయిన్లు రిబ్బన్ కటింగులకు, పబ్బులకు, ఫ్యాషన్ షోలకైతే వెళాతరనీ, ఇటువంటి అవార్డు ఫంక్షన్లకు రారనీ దాసరి ద్వజమెత్తారు. మరి అనుష్క దాసరి ఆఫర్ ను అంగీకరిస్తుందంటారా...తిరస్కరిస్తుందంటారా...?


Click it and Unblock the Notifications











