గ్లామర్ పాత్రలే ఇవ్వండి ప్లీజ్...అనుష్క
'వేదం'లోని అమలాపురం సరోజ, పంచాక్షరి, అరుంధతి లాగ కాకుండా మళ్లీ అందాల అనుష్కని మహేష్ సినిమాలో చూస్తారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో నేను చేసిన సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటోంది అనుష్క. అలాగే...వైవిధ్యమైన పాత్రలు అరుదుగా వస్తాయి. హీరోయిన్ గా పదికాలాల పాటు కొనసాగాలంటే..ఆ పాత్రలను మాత్రమే పట్టుకొని వేళ్లాడకూడదు. గ్లామర్ పాత్రలను కూడా చేస్తుండాలి. అందుకే నేను గ్లామర్‌ని వదులుకోను...దర్శక,నిర్మాతలు అలాంటి పాత్రలతో వస్తే బాగుండును అంటూ చెప్పుకొచ్చింది.
పంచాక్షరి, సరోజ, అరుంధతి పాత్రలు క్లిక్ అయ్యి తను ప్రేక్షకులలో అలాగే బాగా రిజిస్టర్ కావటంతో చాలా మంది అలాంటి పాత్రలోనే తనని సంప్రదిస్తున్నారని తనకు గ్లామర్ పాత్రలు చేయాలని ఉందని చెప్తోంది. ఆ పాత్రలు చేస్తే పేరొచ్చినా గ్లామర్ పాత్రలు హీరోల ప్రక్కన చేస్తే డబ్బు బాగా వస్తుందని,తనే మొత్తం చిత్రాన్ని మోయక్కర్లేదని ఆమె బావించే ఇలా చెప్తోందంటున్నారు. ఇక అనుష్క త్వరలో తమిళ 'సింగం' డబ్బింగ్ 'యముడు', మహేష్ తో చేస్తున్న సినిమా, వెంకటేశ్ 'చంద్రముఖి-2', రవితేజ సరసన కూడా వీర చిత్రంలోనూ, నాగార్జున సరనస వీరూపోట్ల దర్శకత్వంలోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











