అది కేవలం అనూష్కకే సాధ్యం...రవితేజ
విక్రమార్కుడు, బలాదూర్ చిత్రాల్లో తనకు జోడీగా నటించిన స్టార్ హీరోయిన్ అనుష్కపై రవితేజ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్ వ్యూలో మాట్లాడుతూ తాను ఇప్పటి దాకా కలిసి పని చేసిన హీరోయిన్లలో అనుష్క ది బెస్ట్ అన్నాడు. ఎందుకంటే షూటింగ్ సమయంలో అనుష్క చాలా సరదాగా వుంటుంది. సెట్ లో అందరితో కలిసిపోతుంది. యాక్షన్ అనగానే మళ్లీ ప్రొఫెషనల్‌గా మారిపోతుంది. కేవలం ఇది అనుష్కకే సాధ్యమయిందని రవితేజ చెప్పుకొచ్చాడు. హీరోయిన్లు ఇలా సరదాగా వుంటేనే షూటింగ్‌లో మంచి వాతావరణం నెలకొంటుందన్నాడు. అలాగే తాను నటించిన సినిమాల్లో ది బెస్ట్ 'ఇడియట్" అనీ, 'ఇడియట్" తర్వాత ఆ రేంజ్‌లో 'మిరపకాయ్" ఉంటుందని చెప్పుకొచ్చారు. 'మిరపకాయ్" చిత్రం ఈ నెల 13వ తేదీన విడుదల అవుతోంది. రమేష్‌పుప్పాల నిర్మించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











