అనూష్కని నాగచైతన్య కాదా?
అరుంధతి సినిమాతో పెద్ద స్టార్ గా మారిన అనూష్క ని పరిశ్రమకు పరిచయం చేసింది నాగార్జున సూపర్ సినిమాతో అని అందరికీ తెలుసు. అంతేగాక నాగార్జున తనయుడు నాగచైతన్య అప్పట్లో ఆమె దగ్గర బెంగళూరులో యోగ ట్రైనింగ్ తీసుకుని ముచ్చటపడే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాడని మరో వార్త పరిశ్రమ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అలాగే నాగచైతన్య తాజా చిత్రం జోష్ లో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే వీటిన్నటినీ ఖండిస్తూ అలాంటిదేమీ లేదన్నట్లు అనూష్క తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొంది.
అనూష్క మాటల్లోనే భరత్ ఠాగూర్ నా యోగా ఇన్ స్టక్టర్. ఆ తర్వాత ఆయన నటి భూమికను పెళ్లిచేసుకున్నారు. దర్శకుడు ఇ.నివాస్ కు భరత్ ఠాగూర్ మంచి మిత్రుడు. ఆ పరిచయంతోనే భరత్ నన్ను నివాస్ కు పరిచయం చేశారు. అదే సమయంలో పూరీ జగన్నాథ్ గారు ఓ సినిమా తీయాలనుకుంటున్నారు. ఇది తెలిసిన నివాస్ నన్ను పూరీ జగన్నాథ్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత పూరీ సూపర్ సినిమా తీయడం..నేను ఆ చిత్రంతో పరిచయం కావడం అందరికీ తెలిసిందే' అంటూ అనుష్క నవ్వుతూ చెప్పుకొచ్చింది. అదీ విషయం.ఇంతకీ అనూష్క..నాగచైతన్య సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తోందా లేదా...


Click it and Unblock the Notifications











