పరస్పర సహకారంతో అనూష్క, నాగార్జున
తాజాగా విడుదలైన నాగార్జున కేడి చిత్రంలో అనూష్క ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పబ్లిసిటీలోగానీ,మరెక్కడా కానీ ఆ విషయాన్ని ప్రస్దావించకుండా దాచి ధియోటర్ లో సర్పైజ్ చేద్దామనుకున్నారు దర్శక,నిర్మాతలు. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఆ పాట గురించి మాట్లాడేవారు కరవు అయ్యారు. ఈ విషయాన్ని అనూష్క తన సన్నిహితులతో చెప్పుకుని బాధ పడినట్లు తెలుస్తోంది. ఇక సూపర్ తనని సిని పరిశ్రమకు పరిచయం చేసిన నాగార్జునకు కృతజ్ఞతతో ఆ పాట చేసానని,రెమ్యునేషన్ విషయం కూడా పట్టించుకోలేదని,అయితే పాట ఎలివేట్ అయితే తన శ్రమ వృధా పోకుండే ఉండేదని ఆమె భావిస్తోంది. ఇక నాగార్జున కూడా అనూష్క ప్రధాన పాత్రలో చేస్తున్న తకిట తకిట చిత్రంలో గెస్ట్ రోల్ లో కనపించనున్నారు. ఇలా ఇద్దరూ గెస్ట్ రోల్స్, ఐటం సాంగ్స్ ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలాగే అనూష్క 'సూపర్' చిత్రానికి తనకు తొలిసారిగా మేకప్ చేసిన నాగార్జున పర్సనల్ మేకప్ మన్ బొమ్మదేవర రామచంద్రరావుకి అప్పట్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు అతను నిర్మిస్తున్న 'పంచాక్షరి' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. సముద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అనూష్క ప్రస్తుతం మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











