ఆ ఇధ్దరు 2010 సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్స్!
'అరుంధతి" సినిమా అనుష్క కు 'మగధీర" సినిమా కాజల్ కు మంచి స్థానాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ సౌత్ లో క్రేజీ కథానాయికలుగా టాప్ లో ఉన్నారు. అనుష్క అయితే ఏకంగా టాలీవుడ్, కోలీవుడ్ లో కలిపి మొత్తం 8 సినిమాలు దాకా చేస్తోంది. వేదం, ఖలేజా, పంచాక్షరి తదితర చిత్రంలతో పాటు నాగార్జున సరసన ఒక సినిమా చేస్తోంది. తమిళంలో విజయ్ సరసన 'వేటైక్కారన్" కాకుండా మరో రెండు సినిమాలు చేస్తోంది.
ఇక కాజల్ విషయానికొస్తే డార్లింగ్-ప్రభాస్, బృందావనం-జూ ఎన్టీఆర్ సరసన ఇప్పటికే నటిస్తున్నసినిమాలు. ఇవి కాకుండా నాగచైతన్య సరసన ఓ సినిమాకు కమిట్ అయ్యింది. తమిళంలో కూడా ఓ సినిమా కమిట్ అయ్యిందని తెలుస్తోంది. అందు వలన అనుష్క, కాజల్ ఇద్దరూ క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తూ 2010 ఎక్కువ సినిమాలు చేసే కథానాయికల జాబితాలో చేరతారని చెప్పోచ్చు.
More from Filmibeat
అనుష్క కాజల్ అరుంధతి మగధీర వేదం పంచాక్షరి anushka kajal arundhati vedam panchakshari magadheera brindavanam darling naga chaitanya


Click it and Unblock the Notifications











