అనుష్క భూ వివాదం కేసు వాయిదా
తాజాగా ఈ కేసు ఫిబ్రవరి 27, 2013కు వాయిదా పడింది. విక్రమార్కుడు చిత్రం షూటింగ్ సమయంలో సమయంలో అనుష్క, దర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి విశాఖపట్నంలో భూమిని కొన్నారు. అయితే ఆ భూమిని వారు తప్పుడు పత్రాలు చూపించి కొన్నారని నారాయణ అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు.
దీంతో కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. ఇప్పటికీ పలుమార్లు కోర్టుకు హాజరు కావాల్సిందిగా అనుష్కకు కోర్టు సూచించింది. గతంలో ఓసారి తన లాయరును పంపించి కోర్టుకు హాజరు కాలేనని స్టే తెచ్చుకుంది. ఆమె కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అనుష్క సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం అనుష్క చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నాగార్జునతో నటించిన 'డమరుకం' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. ఆమె ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'మిర్చి', కార్తితో 'అలెక్స్ పాండ్యన్', ఆర్య హీరోగా రూపొందుతున్న ఇరండం ఉలగమ్ చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా శౌర్యం, దరువు చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైంది.


Click it and Unblock the Notifications












