ఆమె కోసం హీరోలు తాపత్రయం ఆమె మాత్రం రజీకాంత్, విక్రమ్, కమల్ అంటోంది...
అరుంధతిగా, వేశ్యగా, పంచాక్షరిగా నటించి నటిగా తనకు తానే సాటి అని నిరూపించుకున్న అందాల భామ అనుష్క కి రజనీ, కమల్, విక్రమ్ వంటి స్టార్ లతో నటించాలని ఉందట. ఇటీవల ఆమె తమిళ స్టార్ హీరో సూర్య తో కలిసి నటించిన తమిళ చిత్రం 'సింగం" అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమానే తెలుగులో 'యముడు"గా విడుదలైన సంగతి తెలిసిందే..అనుస్క అందచందాలకు దాసోహమైన ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఉన్నారు. 'బిల్లా" లో బికినీ వేసుకొని అదరగొట్టిన ఈ భామ ఈ చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. అరుంధతిగా, వేశ్యగా నటించడం అనుష్క కే చెల్లిందని చెప్పవచ్చు. చాలా మంది హీరోలు అనుష్కతో నటించాలని తాపత్రయపడేవారు ఉన్నారు.
'సింగం" సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో తమిళ హీరోలంతా అనుష్క తో నటించడానికి తాపత్రయపడుతున్నారట. కానీ అనుష్క కు మాత్రం రజనీ, కమల్, విక్రమ్ వంటి స్టార్ లతో నటించాలని ఉందని అంటోంది. మరి అనుష్క కలలు నెరవేరుతాయో లేదో వేచి చూద్దాం..


Click it and Unblock the Notifications











