»   »  ఏం మాట్లాడింది?‌: ఫ్యాన్స్ తో అనుష్క సరదా ముచ్చట్లు

ఏం మాట్లాడింది?‌: ఫ్యాన్స్ తో అనుష్క సరదా ముచ్చట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వస్తున్న 'బాహుబలి'లో దేవసేన పాత్ర పోషిస్తోంది అనుష్క. ఆమె ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ... ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించారు. బాహుబలి చిత్రానికి సంబంధించి, తన అనుభవాల గురించి అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అరుంధతి, రుద్రమదేవి, దేవసేన పాత్రల్లో తనకు ఇష్టమైన పాత్ర ఏదని అడగగా.. అరుంధతి అని అనుష్క తెలిపారు. బాహుబలి తెలుగు ప్రేక్షకులకే కాకుండా అందరికీ నచ్చుతుందన్నారు. ప్రభాస్‌తో తనకు ఇది మూడో సినిమా అని ఆయన చాలా కలుపుగోలుగా ఉంటారని తెలిపారు.

తమన్నా గురించి చెబుతూ.. నిజంగా ఆమె బార్బీడాలే అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తన పాత్రను చూసిన వారంతా తనపై ఉన్న అభిమానాన్ని మరింత పెంచుకుంటారన్నారు.

Anushka live chit chat with Fans

భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి' చిత్రం టీజర్‌ శనివారం రాత్రి విడుదలైంది. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించారు. చిత్ర కథానాయిక అనుష్క ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్‌ లాంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది. జూన్‌ 1న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

తెలుగే కాదు..తమిళంలోనూ...

రాణి, పోరాట యోధురాలు.. వంటి పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే తత్వం అనుష్కది. ఈ పొడవ కాళ్ల సుందరి.. తమిళంలో 'రెండు' ద్వారా పరిచయమైనా.. రెండోసారి ఎంట్రీ ఇస్తే కానీ.. తమిళ తంబిల కృప కలగలేదు.

'సింగం', 'వేట్టెక్కారన్‌', 'అలెక్స్‌ పాండియన్‌' వంటి కమర్షియల్‌ చిత్రాల్లో నటించడం మాత్రమే కాకుండా.. 'అరుంధతి' వంటి హర్రర్‌ చిత్రాల్లో కూడా నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల అజిత్‌ నటించిన 'ఎన్నై అరిందాల్‌'లో నటించి తమిళ అభిమానుల మెప్పు పొందారు. తాజాగా 'రుధ్రమదేవి'లో నటిస్తున్న అనుష్క.. ఆర్య సరసన 'ఇంజి ఇడుప్పళగి'లో ఆడిపాడుతున్నారు.

English summary
Anushka gave a live chit Chat about Bahubali movie and other things with Fans.
Please Wait while comments are loading...