ద్విపాత్రాభినయం చేస్తున్నా... అదే హైలెట్: అనుష్క

By Srikanya

హైదరాబాద్: అరుంధతి, పంచాక్షరి చిత్రాలలో ద్విపాత్రాభినయం చేసిన అనుష్క మరోసారి తన నట విశ్వరూపం ప్రదర్శించనుంది. ఆమె తాజా చిత్రం 'బృందావనంలో నందకుమారుడు'లో ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో ఓ పాత్ర సాధారణ గృహిణి కాగా రెండవది ఆటవిక యువతి పాత్ర. ఈ రెండు పాత్రలూ వేటికవే భిన్నంగా ఉండి,హైలెట్ అవుతాయని ధీమాగా చెప్తోంది అనుష్క. ఇక అటవిక యువతి పాత్రలో కేవలం ఆకులే అచ్చాదనగా ఉంచుకుని కనిపించి తన అభిమానులను అలరించనుంది. అంతేగాక ఈమె మొదటి సారిగా తన డబ్బింగ్ తానే చెప్పుకుంటోంది. ఇందుకోసం ఆమె క్లాసులకు హాజరవుతోంది.

అనుష్క మాట్లాడుతూ- ''ఈ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాను.'అరుంధతి' తర్వాత నాకు అంతకన్నా గొప్ప పేరును తెచ్చిపెట్టే సినిమా ఇది. ఇందులో కొత్త అనుష్కను చూస్తారు. ద్విపాత్రాభినయం చేయడం నాకు కొత్తేం కాదు. అరుంధతి, పంచాక్షరి చిత్రాల్లో ఇప్పటికే ద్విపాత్రలు చేశాను. కానీ ఆ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులోని నా పాత్రలు సాగుతాయి. ఇంత మంచి పాత్రలను ఇచ్చి ప్రోత్సహించిన సెల్వరాఘవన్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను'' అన్నారు.

ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే ఒక ఎపిసోడ్‌లో ఆమె ఆటవిక యువతిగా కనిపిస్తారు. ఇందుకోసం వస్త్రాలను పక్కనపెట్టి కేవలం ఆకులనే ఆచ్ఛాదనాలుగా చేసుకొని అనుష్క నటించనున్నారు. ఈ విషయం గురించి అనుష్కకు సెల్వరాఘవన్ వివరించినప్పుడు ముందు తటపటాయించారు. తర్వాత కథలో ఆ ఎపిసోడ్‌కు ఉన్న ప్రాముఖ్యతను విన్న తర్వాత ఒప్పుకోక తప్పలేదు. దాదాపు అయిదువందల ఏళ్ల క్రితం ఉండే ఆటవికుల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ సాగుతుందని సమాచారం. ఆర్య కూడా ఇదే తరహాలో ఆకులతోనే నటించనుండటం విశేషం.

దర్శకుడు సెల్వ రాఘవన్ మాట్లాడుతూ.. ఆటవిక యువతిగా అనుష్క ఎన్నో రేర్ ఫీట్స్ చేసింది. భయంకరమైన పోరాట సన్నివేశాల్లో కూడా పాల్గొంది. ఆ పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఈ పాత్ర అనుష్క కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు. ఈ పాత్ర కోసం అనుష్క మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X