ఆ రూమర్స్...అనుష్క తట్టుకోలేక పోతోంది
హైదరాబాద్: అనుష్క పెళ్లంటూ ఈ మధ్య రూమర్స్ తెగ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అనుష్క పలు సందర్భాల్లో ఖండించినా...మళ్లీ మళ్లీ ఆ వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆమెను కలిసిన వారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తుండటంతో చిర్రెత్తిపోతోందట. ఈ రూమర్స్ వల్ల ఒత్తడి తట్టుకోలేక షూటింగుపై సరైన దృష్టి పెట్టలేక పోతోందట.
దక్షిణాదిన తన అందచందాలు, పెర్ఫార్మెన్స్‌తో టాప్ హీరోయిన్‌గా దూసుకెలుతున్న అనుష్క ప్రస్తుతం బాహుబలి, రుద్రమదేవి, లింగా లాంటి చారిత్రాత్మక భారీ ప్రాజెక్టులతో పాటు అజిత్ హీరోగా మరో సినిమా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమాలను త్వరిత గతిన పూర్తి చేసుకోవాలని అనుష్క భావిస్తోందని, అదే సమయంలో కొత్త ప్రాజెక్టులు, కమిట్మెంట్స్ కూడా ఏమీ తీసుకోడం లేదని అంటున్నారు.

ఇటీవల లింగా షూటింగు సెట్లో కొత్త డైరెక్టర్ ఓ సినిమా స్టోరీ చెప్పడానికి వస్తే చేయనని తెగేసి చెప్పిందట. అనుష్క ఎందుకు ఇలా చేస్తోందని ఆరా తీస్తే...ప్రస్తుతం తన చేతిలో ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోవాలని ప్లాన్ చేసుకుంటోందంటూ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఈ రూమర్స్ అనుష్క ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ పైనే ఉందని ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని ఖరాఖండిగా చేప్పేస్తోంది. తన పెళ్లి విషయంలో రూమర్స్ ప్రచారం చేయడం ఆపాలని, అలాంటిదేమైనా ఉంటే తానే స్వయంగా చెబుతానని స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications











