అనుష్క వచ్చేస్తుంది.. ఏకంగా పవన్ కల్యాణ్, చిరంజీవితోనే ఢీ..
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ మొత్తంలో కూడా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకున్న బ్యూటీ అనుష్క శెట్టి. బాహుబలి తర్వాత ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే మిగతా స్టార్స్ అందరూ కూడా చాలా వేగంగా వారి తదుపరి ప్రాజెక్టులను లైన్లోకి తీసుకువస్తూ ఉండగా అనుష్క మాత్రం ఇంకా చాలా నెమ్మదిగానే సినిమాలు చేసుకుంటూ వెళుతొంది.
కేవలం తనకు సెట్ అయ్యే మంచి కథలు మాత్రమే ఆమె సెట్ చేసుకుంటూ బిజీ అవుతోంది. ఇక అనుష్క శెట్టి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ కూడా చాలా రోజుల క్రితమే ముగిశాయి.

ఇక సినిమాను ఈ ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే సాంగ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. అయితే మొత్తానికి ఇప్పుడు సినిమాకు సంబంధించిన విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చేశారు. ఆగస్టు 4వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా రాబోతున్నట్లు ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు.
అయితే ఆ సమయంలోనే కాస్త ముందుగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో సినిమా జులై 28వ తేదీన రానుంది. ఇక ఆగస్టు 8వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ రెండు మెగా సినిమాల మధ్యలో అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమా విడుదలవుతుండడం విశేషం. బాక్సాఫీస్ వద్ద ఎంతో కొంత పోటీ అయితే నెలకొనే అవకాశం అయితే ఉంది. కానీ కంటెంట్ క్లిక్ అయితే మాత్రం ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











