అనుష్క నాకు రోల్ మోడల్: అమల
కథానాయిక అనుష్కకి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అమలా పాల్ రూపంలో మరో అభిమాని దొరికింది. అనుష్కని అమలా ఇప్పుడు తెగ పొగిడేస్తోంది. వీరిద్దరూ ఇటీవల 'నాన్న' సినిమాలో కలిసి నటించిన సంగతి మనకు తెలిసిందే. అప్పుడే వీరిద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడిందట. తను అప్ కమింగ్ ఆర్టిస్టు అయినప్పటికీ, తనని అనుష్క ఎంతో బాగా ట్రీట్ చేసిందనీ, తనకు గౌరవ మర్యాదలిచ్చిందనీ అమలా చెబుతోంది.
రోజూ తాము ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకుంటున్నామనీ, ఆమెతో మాట్లాడుతుంటే సమయమే తెలియదనీ అమలా అంటోంది. 'అనుష్కను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. పెద్ద స్టార్నన్న ఫీలింగ్ అసలు తనలో ఏమాత్రం వుండదు. అందుకే తానిప్పుడు నాకు రోల్ మోడల్ అయిపోయింది" అంటోంది ఈ కేరళ కుట్టి. ప్రస్తుతం అటు తమిళ చిత్రాలలో నటిస్తూనే, తెలుగులో 'బెజవాడ రౌడీలు' సినిమాలో నాగచైతన్య సరసన కథానాయికగా అమలా పాల్ నటిస్తోంది.
amala paul anushka nanna naga chaitanya bejawada rowdilu అమలా పాల్ అనుష్క నాన్న నాగచైతన్య బెజవాడ రౌడీలు


Click it and Unblock the Notifications