క్రేజీ హీరోతో అనుష్క రొమాన్స్.. అప్పట్లోనే హాట్ హాట్‌గా, 12 ఏళ్ల తరువాత మళ్ళీ!

Recommended Video

Anushka's Next Movie With Madhavan

అందాల తార అనుష్కకు సంబంధించిన ఏ వార్త అయినా ప్రస్తుతం వైరల్ అయిపోతోంది. అనుష్కకు ఉన్న క్రేజ్ అలాంటిది. బాహుబలి దేవసేనగా నట విశ్వరూపం ప్రదర్శించిన అనుష్క ఆ తరువాత భాగమతి చిత్రంలో నటించింది. సింగిల్ హ్యాండ్ తో భాగమతి చిత్రాన్ని అనుష్క విజయతీరాలకు చేర్చింది. అనుష్క స్టామినాకు ఇది నిదర్శనం. గ్లామర్ రోల్స్ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన స్వీటీ నెమ్మదిగా లేడి సూపర్ స్టార్ రేంజ్ కి చేరుకోడవం విశేషం. భాగమతి చిత్రం తరువాత నుంచి అనూష తదుపరి చిత్రాల విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.

 లెక్కకు మించిన పుకార్లు

లెక్కకు మించిన పుకార్లు

భాగమతి చిత్రం తరువాత అనుష్క మరో చిత్రం చేయకపోవడంతో సోషల్ మీడియాలో లెక్కకు మించిన పుకార్లు వ్యాపించాయి. అనూష్క పెళ్ళికి సిద్ధం అవుతోందంటూ వదంతులు సృష్టించారు. అనుష్క పుణ్యక్షేత్రాలని దర్శించినా పెళ్లి కోసం అంటూ ప్రచారం చేశారు. కానీ వాస్తవం అది కాదు. అనుష్క తన తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతోంది.

 ఫిజిక్‌పై దృష్టి

ఫిజిక్‌పై దృష్టి

అనుష్కకు అందంలోనూ, నటనలోనూ తనకు తానే సాటి. పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి ప్రయోగానికైనా సిద్ధపడుతుంది. సైజ్ జీరో చిత్రం కోసం బాగా బొద్దుగా తయారైంది. ఆ తరువాత మల్లి కాస్త సన్నబడింది. భాగమతి చిత్రం తరువాత కొంచెం బొద్దుగా మారడంతో అనుష్క తన ఫిజిక్ పై దృష్టి పెట్టింది. సహజసిద్ధంగా సన్నబడేందుకు విదేశాల్లో ప్రకృతి వైద్యం చేయించుకుంటోంది.

 రొమాంటిక్ హీరోతో

రొమాంటిక్ హీరోతో

ఒకప్పుడు తమిళ హీరో మాధవన్ కు రొమాంటిక్ హీరోగా మంచి క్రేజ్ ఉండేది. ప్రస్తుతం మాధవన్ విభిన్న పాత్రలని ఎందుకుంటున్నారు. ఇటీవల సవ్యసాచి చిత్రంలో మాధవన్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అనుష్క, మాధవన్ త్వరలో జంటగా నటించబోతున్నారు.

ప్రకటించిన కోన వెంకట్

ప్రకటించిన కోన వెంకట్

ప్రముఖ రచయిత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు అని ప్రచారం జరుగుతోంది. కోన వెంకట్, గోపి మోహన్ ఈ చిత్రానికి రచయితలు. నటుడు సుబ్బరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది యూఎస్ లో ప్రారంభం అవుతుందని కోన వెంకట్ తెలిపారు.

12 ఏళ్ల క్రితం రొమాన్స్ అదుర్స్

12 ఏళ్ల క్రితం రొమాన్స్ అదుర్స్

మాధవన్, అనుష్క ఇప్పటికే ఓ చిత్రంలో కలసి నటించారు. 2006 లో విడుదలైన రెండు అనే చిత్రంలో అనుష్క, మాధవన్ జంటగా కనిపించరు. ఈ చిత్రంలో వీరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. 12 ఏళ్ల తరువాత మళ్ళీ ఈ జంట వెండి తెరపై మెరవబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X