కత్తిపట్టిన అనుష్క : ‘వర్ణ’ ఫస్ట్‌లుక్ ఫోటోలు
హైదరాబాద్ : హాట్ లేడీ అనుష్క, తమిళ హీరో ఆర్య జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళంలో 'ఇరండమ్ ఉలగమ్' అనే చిత్రానికి తెలుగు టైటిల్ 'బృందావనంలో నందకుమారుడు' కాకుండా 'వర్ణ' అని మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫోటోలు విడుదల చేసారు.
గతంలో 'అరుంధతి' చిత్రంలో కత్తి పట్టిన అనుష్క....వర్ణ చిత్రంలో కత్తి పోరాటాలు చేస్తూ సాహస యువతిగా కనిపించనుంది. ఈ పోస్టర్లు చూస్తుంటే సినిమా విభిన్నంగా, సరికొత్తగా ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో 'యుగానికి ఒక్కడు' లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమానే ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

వర్ణ చిత్రంలో అనుష్క విభిన్నమైన లుక్

ఈ పోస్టర్లు చూస్తుంటే ఇదేదో మిస్టరీతో కూడిన కథాంశమని స్పష్టం అవుతంది.

ఈ చిత్రానికి హారిష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి పివిపి సినిమాస్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆగస్టు నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











