రోజుకో కొత్త అనుభవం..అనూష్క

మొదట సూపర్ సినిమాతో కెమెరా ముందుకొచ్చాను. ఆ ఛాన్స్ వచ్చేటప్పటికి నాకెలాంటి అనుభవం లేదు. అప్పుడు అనుకున్నాను..తొలి సినిమా కాబట్టి అన్నీ నేర్చేసుకొంటే చాలు. ఆ తరవాత అదే అలవాటైపోతుంది అని! కానీ ఇప్పుడా అభిప్రాయం మార్చుకున్నాను. ప్రతి రోజూ రకరకాల మనస్తత్వాలున్న వారిని కలుసుకుంటున్నాను. ఎన్నెన్నో విషయాలు తెలుస్తున్నాయి. కొంతమంది ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికిపడ్డ కష్టాలను వింటుంటే ఎన్‌సైక్లోపీడియాలను తిరగేసినంత జ్ఞానాన్ని సముపార్జించగలుగుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఐఏయస్ పరీక్షలకు సన్నద్ధమై... అందులో నెగ్గిన తరవాత మళ్లీ ఆ పుస్తకాల వంక చూడనవసరం లేదు. నటీనటులు మాత్రం ప్రతి నిత్యం తమను తాము మెరుగుపరచుకుంటూ ఉండాలి. ప్రస్తుతం అనూష్క మహేష్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











