»   » అమెరికాలో అనుష్కకు స్పెషల్ ట్రీట్మెంట్

అమెరికాలో అనుష్కకు స్పెషల్ ట్రీట్మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సైజ్ జీరో చిత్రం హీరోయిన్ అనుష్క ఏకంగా 20 కిలోల బరువు పెరిగిన సంగతి తెలిసిందే. త్వరలో ఆమె తన బరువు తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టబోతోంది. త్వరలో ఆమె ‘బాహుబలి-2' సినిమా షూటింగులో పాల్గొన బోతున్న నేపథ్యంలో బరువు తగ్గాల్సిన అవసరం ఏర్పడింది.

‘బాహుబలి-2 సినిమాలో షూటింగు కోసం అనుష్క మళ్లీ బరువు తగ్గాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం ఆమె అమెరికాలో వెయిట్ లాస్ థెరపీ పోగ్రామ్ లో పాల్గొంటుంది' అని ఆమె సన్నిహితులు తెలిపారు. మళ్లీ ఆమె అభిమానులను మెప్పించే విధంగా సెక్సీ లుక్ లోకి మారబోతోంది.

మరో వైపు మంగళవారం రాజమౌళి అండ్ టీం ‘బాహుబలి-2' సినిమాకు సంబంధించిన పనులు మొదలు పెట్టారు. సెకండ్ పార్ట్ లో అనుష్క రోల్ చాలా కీలకం కానుంది. ఆమె నవంబర్ లో షూటింగులో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

Anushka On Weight Loss programme

రాజమౌళి మరియు ఇతర టెక్నీషియన్లు నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో కలిసారు. బాహుబలి-2కు సంబంధించిన సెట్స్ గురించి చర్చించారు. రెగ్యులర్ షూటింగ్ నెక్ట్స్ వీక్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సెకండ్ పార్టులో అనుష్క రోల్ కీలక అయిన నేపథ్యంలో వెయిట్ లాస్ విషయంలో ఆమె చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది.

బాహుబలి-2కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. బాహుబలి-1 సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ మరింత ఆసక్తికరంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడానికి దాదాపు ఆరు నుండి 8 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.

English summary
"Anushka has to lose some weight before she joins the sets of 'Baahubali 2'. She will undergo a weight loss therapy in US, and will soon leave to attend the same," a source close to the 33-year old star told IANS.
Please Wait while comments are loading...