‘అనుష్క డౌట్లతో చంపేసింది.. అయ్యో బాబోయ్ అనుకొన్నా!’
బాహుబలి2 తర్వాత అందాల తార అనుష్క నటించిన భాగమతి చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. దేవసేన పాత్రతో ప్రేక్షకులకు చేరువకావడంతో భాగమతి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో భాగమతి చిత్ర వివరాలను ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు దర్శకుడు అశోక్ వెల్లడించారు. అశోక్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

అనుష్క కోసం ఐదేళ్లు వేచి చూశా
భాగమతి చిత్రంలో నటింప జేసేందుకు అనుష్క కోసం ఐదు సంవత్సరాలు వేచిచూశాను. నటన పట్ల అంకితభావం ఉన్న ఆమె తప్ప మరొకరు మెప్పించలేరనే భావన నాకు ఉండేది. అందుకే బాహుబలి1, బాహుబలి2, రుద్రమదేవి చిత్రాలు పూర్తయ్యే వరకు వేచి చూశాను.

అనేక సందేహాలతో
భాగమతి చిత్రం కోసం అనుష్క పడిన శ్రమ మాటల్లో చెప్పలేను. ఈ సినిమా కోసం ఎంతో సమయాన్ని వెచ్చిచ్చారు. స్క్రిప్టు గురించి ఎన్నో సందేహాలు లేవనెత్తేవారు. దాంతో తాను స్క్రిప్టులో అనేక మార్పులు, చేర్పులు చేపట్టాను.

ఇంట్రస్ట్ లేదా అనిపించింది
ఓ దశలో స్క్రిప్టు మీద అనుష్కకు ఇంట్రస్ట్ లేదా అనే సందేహం కలిగేది. అనుష్క భాగమతి పాత్రలో ఎంత లీనమైపోయిందనే విషయం ఆ తర్వాత తెలిసింది. దాంతో భాగమతి పాత్రను విభిన్నంగా చిత్రీకరించడానికి ఆమె అంకితభావం తోడ్పాటునందించింది.

ఆ సీన్ అద్భుతంగా
భాగమతి చిత్రంలో ఓ సన్నివేశంలో అనుష్క నటన అమోఘంగా ఉంటుంది. ట్రైలర్‌లో కూడా ఆ సన్నివేశాన్ని చూపించాం. తనకు తానుగా అనుష్క గోడకు తన చేతులు పెట్టి కీలలు కొట్టుకనే సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆ సీన్‌ను రెండు రోజులపాటు చిత్రీకరించాం.

అనుష్కశెట్టి తప్ప మరొకరు
భాగమతి పాత్ర కోసం అనుష్క చూపిన కమిట్‌మెంట్ మరొకరు చూపించరేమో అనే ఫీలింగ్ కలిగింది. భాగమతిగా అనుష్క తప్ప మరొకరు నటించలేరు అని దర్శకుడు అశోక్ వెల్లడించారు. భాగమతి చిత్రం ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











